HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Is Jagga Reddy Doing Same Errors Like Revanth

Telangana Congress:రేవంత్ చేసిన తప్పే జగ్గారెడ్డి చేస్తున్నాడా?

కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా అది సమిష్టినిర్ణయమై ఉండాలని కానీ ఈ మధ్ పార్టీలోని కొందరు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇది పార్టీకి నష్టాన్ని కలిగిస్తుందని నిన్నమొన్నటి దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వాదించాడు.

  • Author : Siddartha Kallepelly Date : 09-01-2022 - 1:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagga Reddy Revanth reddy
Jagga Reddy Revanth reddy

కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా అది సమిష్టినిర్ణయమై ఉండాలని కానీ ఈ మధ్ పార్టీలోని కొందరు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇది పార్టీకి నష్టాన్ని కలిగిస్తుందని నిన్నమొన్నటి దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వాదించాడు. కానీ ఇప్పుడు ఆయన కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

తన నియోజకవర్గంలో లే అవుట్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, లే అవుట్ లను రెగ్యులరైజ్ చేయాలని జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ కి లేఖ కూడా రాశారు. తాజాగా మరోసారి ఈ విషయంపై ప్రభుత్వానికి మరోసారి జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని తాను మాత్రమే ఈ నిరసన తెలుపుతున్నానని జగ్గారెడ్డి తెలిపారు.

మొన్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల విషయంలో కూడా విద్యార్థులను పాస్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేస్తూ ఇంటర్మీడియట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆరోజు కూడా కాంగ్రెస్ నేతలెవరూ ఆ ప్రొటెస్ట్ లో ఇన్వాల్వ్ కాలేదు. అయితే జగ్గారెడ్డి ప్రొటెస్ట్ చేసిన రోజే ప్రభుత్వం విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇది ముమ్మాటికీ తన విజయమేనని జగ్గారెడ్డి క్లెయిమ్ చేసుకున్నారు.

తాజాగా జగ్గారెడ్డి నిరసన తెలుపుతున్న లే అవుట్ రెగ్యులరైజ్ అంశం ఒక సంగారెడ్డి నియోజకవర్గనికే పరిమితం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య కొనసాగుతుంది. కానీ పార్టీ తో సంబందం లేకుండా తాను ఒక్కడే ఈఅంశంపై దీక్ష చేస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో మంజీర నీటి విషయంలో కూడా ఎవరికీ సంబంధం లేకుండా జగ్గారెడ్డి పాదయాత్ర చేశారు.

జగ్గారెడ్డి సొంత ఎజెండాతో ముందుకు వెళ్తుండడం, తాను చేసే నిరసనలో కాంగ్రెస్ నేతలెవ్వరూ పాల్గొనరని చెప్పడం కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తిని కలిగిస్తుంది.

అందరికి చెప్పి కలుపుకొని వెళ్లడం ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదని జగ్గారెడ్డి సింగిల్ గా వెళ్తున్నారా? లేదా తన తీరుని పార్టీ ప్రశ్నించినప్పుడు తనలాగా చేసిన మిగతా నాయకులని ఎందుకు ప్రశ్నించలేదని అడగడానికి జగ్గారెడ్డి ఇలా చేస్తున్నాడా అర్ధం కావట్లేదు. కానీ రేవంత్ చేసిన తప్పులని విమర్శించిన జగ్గారెడ్డి కూడా అదే బాటలో పోవడం పట్ల కాంగ్రెస్ లోని ఒక లేయర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aicc
  • congress
  • Jagga Reddy
  • revanth reddy
  • telangana congress

Related News

Mynampalli Rohith

Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

మెదక్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్‌పై టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గ‌రారెడ్డి ప్రశంసలు కురిపించారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి మైనంపల్లి రోహిత్ వంటి యువ, డైనమిక్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకుడిగా రోహిత్ గుర్తింపు పొందారని జగ్గారెడ్డి అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృష

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd