Investments in Telangana : తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ – గ్లోబల్ బ్రాండ్‌గా మారుతున్న రాష్ట్రం
Investments in Telangana : హైదరాబాద్ హిట్‌ఎక్స్ సెంటర్‌లో ప్రారంభమైన ఇన్వెస్టోపియా గ్లోబల్ సమిట్‌లో ఈ దిశగా తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా వెల్లడి అయ్యాయి
- By Sudheer Published Date - 07:08 PM, Sat - 26 July 25

తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడుగా ప్రణాళికలు రూపొందిస్తోంది. హైదరాబాద్ హిట్‌ఎక్స్ సెంటర్‌లో ప్రారంభమైన ఇన్వెస్టోపియా గ్లోబల్ సమిట్‌లో ఈ దిశగా తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా వెల్లడి అయ్యాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..”తెలంగాణ భౌగోళికంగా చిన్నదైనా, లక్ష్యాలు మాత్రం గొప్పవే” అంటూ అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
Diet with Juice : డైట్ పేరిట బరువు తగ్గేందుకు కేవలం పండ్ల రసాలే తాగుతున్నారా? మీ ప్రాణాలకే డేంజర్
2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ GSDP వృద్ధి రేటు 8.2% గా నమోదైంది. ఇది దేశ సగటు వృద్ధిరేటైన 7.6% కంటే అధికం. ప్రస్తుతం తెలంగాణ జాతీయ స్థాయి GDPలో 5%కు పైగా వాటా ఇస్తోంది. ఈ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక స్థితిని మాత్రమే కాక, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. డెవలప్‌మెంట్‌ను మరింత వేగవంతం చేయడానికి డ్రై పోర్టులు, EV జోన్లు, నెట్-జీరో పార్కులు, మెట్రో ఫేజ్-2 వంటి అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్నాయి.
రాష్ట్రాన్ని టెక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు కీలకంగా మారుతోంది. ఇందులో ఫిన్‌టెక్, AI ల్యాబ్స్, ఏరోస్పేస్ క్లస్టర్లు, డేటా సెంటర్లు వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నారు. గత 18 నెలల్లోనే రూ. 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి లభించడం తెలంగాణ పారిశ్రామిక శక్తిని స్పష్టంగా చూపుతోంది. UAE కంపెనీలైన లూలూ గ్రూప్, డీపీ వరల్డ్, నాఫ్కో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టడం రేవంత్ రెడ్డి దూరదృష్టికి నిదర్శనం. ఈ సందర్భంగా జరిగిన సమ్మిట్‌లో UAE మంత్రులు, గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొనడం రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను నిరూపిస్తోంది.