Defection of MLAs : ముగిసిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
Defection of MLAs : తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన పార్టీ ఫిరాయింపు కేసు (Defection of MLAs) మరో కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ (BRS) తరఫున దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతుండగా
- By Sudheer Published Date - 05:47 PM, Sat - 4 October 25

తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన పార్టీ ఫిరాయింపు కేసు (Defection of MLAs) మరో కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ (BRS) తరఫున దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతుండగా, ఈరోజు మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ హాజరై తమ సమాధానాలు ఇచ్చారు. వీరి తరఫున వచ్చిన అడ్వకేట్లను బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించడం ద్వారా ఈ దశ ముగిసింది.
Post Office Scheme: రూ. 12,500 పెట్టుబడితో రూ. 40 లక్షల వరకు సంపాదన.. ఏం చేయాలంటే?
ఇప్పటికే ఈ కేసులో మొదటగా కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్ లపై విచారణ ముగిసింది. ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌ల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కావడంతో తదుపరి దశకు మార్గం సుగమమైంది. ఈ విచారణలో ముఖ్యాంశం ఏమిటంటే – ఫిరాయింపుకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు, పార్టీ మార్పు సమయంలో తీసుకున్న నిర్ణయాలపై అడ్వకేట్లు గరిష్టంగా ప్రశ్నలు వేస్తున్నారు. ఇంతవరకు నాలుగు ఎమ్మెల్యేల విచారణ పూర్తవడంతో ఈ కేసులో వేగం పెరిగినట్లుగా కనిపిస్తోంది.
తదుపరి దశలో ఇంకా నలుగురు ఎమ్మెల్యేలపై క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఈ నాలుగురి పేర్లతో కూడిన షెడ్యూల్ త్వరలో స్పీకర్ కార్యాలయం నుంచి విడుదల కానుంది. ఈ కేసు ఫలితం తెలంగాణ రాజకీయ వాతావరణంపై ప్రభావం చూపనుందని నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా పార్టీ మార్పులపై స్పీకర్ తీసుకునే నిర్ణయం తదుపరి ఎన్నికల రాజకీయాల్లో కీలకంగా మారవచ్చని, ఆ నిర్ణయం ఆధారంగా భవిష్యత్‌లో ఇతర ఫిరాయింపుల కేసులకు కూడా మార్గదర్శకం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.