HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Indiramma Housing Scheme Rules

Indiramma Housing Scheme Rules : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు

Indiramma Housing Scheme Rules : లబ్ధిదారుడు తన సొంత స్థలంలో మాత్రమే నిర్మాణం చేపట్టాలి. నిర్మాణం ప్రారంభించేముందు గ్రామ కార్యదర్శికి సమాచారం అందించి

  • Author : Sudheer Date : 10-02-2025 - 11:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indiramma Housing Scheme Ru
Indiramma Housing Scheme Ru

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిరుపేదలకు సొంత గృహ కలను నిజం చేయడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme )ను పునరుద్ధరించింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేద ప్రజలు తమ సొంత ఇంటిని కలిగి జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి అవకాశం కలిగింది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితా సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మండలాల్లో ఈ ఇళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతలో 71,482 ఇండ్ల మంజూరు చేసిన ప్రభుత్వం, 21 నియోజకవర్గాల్లో 1000కు పైగా ఇండ్లు కేటాయించింది. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 2,528 ఇండ్లు మంజూరు చేయగా, మంథనిలో 1,952, బోథ్‌లో 1,538, పరకాలలో 1,501 ఇండ్లు మంజూరయ్యాయి. అలాగే, కొడంగల్‌లో 1,046, గజ్వేల్‌లో 1,001 ఇండ్లు అందించనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో 1000లోపు ఇండ్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు.

National Deworming Day : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వ నిబంధనలను (Indiramma Housing Scheme Rules) కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లబ్ధిదారుడు తన సొంత స్థలంలో మాత్రమే నిర్మాణం చేపట్టాలి. నిర్మాణం ప్రారంభించేముందు గ్రామ కార్యదర్శికి సమాచారం అందించి, ఫొటోలు తీయించి, జియో ట్యాగింగ్ చేయించాలి. కనీసం 400 చదరపు అడుగుల స్థలంలో నిర్మాణం చేపట్టాలి. మొదటి విడతలో పునాది పూర్తయిన తర్వాత రూ.1 లక్ష ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుంది.

ప్రభుత్వం 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందించడంతో పాటు, హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా సిమెంట్, స్టీల్ తక్కువ ధరకు లభించేలా ఏర్పాట్లు చేసింది. ఇంటి నిర్మాణ పురోగతిని AE/MPDOలు పరిశీలించి, దశలవారీగా మంజూరు చేసే నగదును సిఫార్సు చేస్తారు. గ్రామాల్లో ప్రీ-గ్రౌండింగ్ సమావేశాలను నిర్వహించి, లబ్ధిదారులకు వివరణనిచ్చే కార్యక్రమాలు అధికారులు చేపడుతున్నారు. ఈ పథకం ద్వారా పేదలకు తక్కువ ఖర్చుతో సొంత ఇంటి కల నెరవేరనుంది. ప్రభుత్వం తీసుకున్న నూతన నిర్ణయాలు లబ్ధిదారులకు మరింత ప్రయోజనం కలిగించనున్నాయి. త్వరలోనే మిగతా గ్రామాల్లో కూడా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Indiramma Houses
  • Indiramma Housing Scheme
  • Indiramma Scheme Rules
  • telangana

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

  • Cm Revanth Reddy Kerala Cam

    keralam Results : కేరళలో ‘రేవంత్’ ప్రభంజనం.. పినరయి కోటలో పాగా వేసిన తెలంగాణ ‘టైగర్’

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd