Indira Soura Giri Jala Vikasam : ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగాలు
Indira Soura Giri Jala Vikasam : రెండు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు సమూహంగా బోర్‌వెల్ యూజర్ గ్రూపుగా ఏర్పడి ప్రయోజనాలు పొందొచ్చు
- By Sudheer Published Date - 07:55 AM, Mon - 19 May 25

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ (Indira Soura Giri Jala Vikasam) పథకం గిరిజన రైతుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురానుంది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా విద్యుత్ సౌకర్యం లేని పోడు భూములకు సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసి నీటి సౌకర్యం అందించనున్నారు. అటవీ హక్కుల చట్టం-2006 (RoFR) ప్రకారం భూములు కలిగి ఉన్న ఎస్టీ రైతులే ఈ పథకానికి అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఎకరాల పోడు భూములకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
Covid-19: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడికి కరోనా.. రేపు జట్టులో జాయిన్?!
ప్రతి యూనిట్ ఖర్చు రూ.6 లక్షలు కాగా, మొత్తం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.12,600 కోట్లు కేటాయించింది. తొలి విడతలో రూ.600 కోట్లు, తదుపరి ప్రతి సంవత్సరం రూ.3,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో ఖర్చు చేయనుంది. జూన్ 25లోపు అర్హులైన రైతులను గుర్తించి, జూన్ 26 నుంచి 2026 మార్చి 31లోపు భూముల అభివృద్ధి, బోర్ల తవ్వకం, సోలార్ పంపుసెట్ల ఏర్పాటు, తదనంతర ఉద్యాన పంటల సాగు మొదలుపెట్టనున్నారు. అధికారుల పర్యవేక్షణలో ఈ పథకం వేగంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ పథకం అమలులో జిల్లా కలెక్టర్‌లు కీలక పాత్ర పోషించనున్నారు. కలెక్టర్‌లు పథక అమలు కమిటీకి చైర్మన్‌గా ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో అధికంగా ఉన్న పోడు భూములపై ప్రాధాన్యతతో చర్యలు తీసుకోనున్నారు. రెండు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు సమూహంగా బోర్‌వెల్ యూజర్ గ్రూపుగా ఏర్పడి ప్రయోజనాలు పొందొచ్చు. సోలార్ ఆధారిత నీటి సదుపాయం వల్ల పోడు భూములు సాగుకి అనువుగా మారి, గిరిజన రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యే అవకాశాలు భారీగా ఉన్నాయి.