HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >If You Get Arrested Do It Ktr

KTR Open Challenge : ఎవనిదిరా కుట్ర..? అరెస్ట్ చేస్తే చేసుకో – కేటీఆర్

KTR Open Challenge : ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? అంటూ తీవ్రంగా స్పందించారు. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? అంటూ నిలదీశారు

  • By Sudheer Published Date - 11:17 AM, Thu - 14 November 24
  • daily-hunt
Ktr Arrest
Ktr Arrest

తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ (Arrest) చేస్తారని ఎప్పుడో తెలుసని..రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను. నీ కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. అరెస్ట్ చేస్తే చేసుకో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు.

వికారాబాద్ జిల్లా లగచర్ల లో స్మార్ట్ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా గ్రామస్థులు , రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సోమవారం జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులు గ్రామస్థులతో మాట్లాడేందుకు రాగా..వారిపై దాడి చేసారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అధికారులపై దాడి చేయడాన్ని పోలీసులు , ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనకు పాల్పడిన పరువుర్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అలాగే ఇదే కేసులో ప్రభుత్వం కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని సైతం అరెస్ట్ చేసింది.

ఆయన రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు కేటీఆర్‌ పేరును సైతం ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్‌తో బీఆర్‌ఎస్‌ నేతల ఆదేశాలు ఉన్నాయని.. రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో కేటీఆర్‌ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీరుపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? అంటూ తీవ్రంగా స్పందించారు. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? అంటూ నిలదీశారు. నీ అల్లుని కోసమో, అన్న కోసమో.. రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? అంటూ ప్రశ్నించారు.

గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్‌‌ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర.. మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? అంటూ ప్రశ్నించారు. 50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? అంటూ ఘాటుగా స్పందించారు. నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసునని.. రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకు పోతానన్నారు. నీ కుట్రలకు భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు.. అరెస్ట్ చేసుకో రేవంత్‌ రెడ్డి.. చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో అంటూ ‘ఎక్స్‌’ పోస్ట్‌లో కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Revanth Reddy!

For a man caught with Rs 50 lakh bribe, everything will seem like a conspiracy!

Farmers protesting against your son-in-law’s pharma company will be a conspiracy!

Farmers not bowing down to your brother’s threats is a conspiracy!

Two people talking on the…

— KTR (@KTRBRS) November 14, 2024

Read Also : Home Remedies : చలికాలంలో మడమల పగుళ్లతో ఇబ్బంది పడుతుంటే ఇలా జాగ్రత్తపడండి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • KTR named in remand report
  • Lagcherla
  • Patnam Narender Reddy arrest

Related News

1.2 Lakh Jobs

1.2 Lakh Jobs: లక్ష్యం 120 జీసీసీలు.. 1.2 లక్షల ఉద్యోగాలు: మంత్రి

చివరగా వాన్‌గార్డ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా రైజింగ్ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.

  • SLBC Tunnel Incident

    SLBC Tunnel Collapse : ‘SLBC టన్నెల్ కూలిపోవడానికి కేసీఆరే కారణం’ – సీఎం రేవంత్ రెడ్డి

  • CM Revanth

    Jubilee Hills By-Election : జూబ్లీహిల్స్ ఫలితం పై రేవంత్ కట్టుదిట్టం..

  • Kcr Nxt Cm

    KCR : 500 రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఖాయం..రాసిపెట్టుకోండి – కేటీఆర్ ధీమా

  • Cm Revanth Canada

    Telangana : తెలంగాణ లో పెట్టుబడులు పెట్టండి ..కెనడా హై కమిషనర్ ను కోరిన సీఎం రేవంత్

Latest News

  • PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

  • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

  • Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఏ రాశి వారు ఎలాంటి వ‌స్తువులు దానం చేయాలో తెలుసా?

  • Suryakumar Yadav: సూర్య‌కుమార్‌, హారిస్ రౌఫ్‌కు షాకిచ్చిన ఐసీసీ!

  • SIR : SIRకు వ్యతిరేకంగా బెంగాల్లో భారీ ర్యాలీ

Trending News

    • India Post Payments Bank: ఇక‌పై ఇంటి నుండే ఆ సర్టిఫికేట్ పొందవచ్చు!

    • Rs 2,000 Notes: మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా రూ. 2 వేల నోట్లు!?

    • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

    • Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!

    • Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd