Kavitha : నేను ఎప్పటికైనా సీఎం అవుతా – కవిత కీలక వ్యాఖ్యలు
Kavitha : తెలంగాణ రాజకీయాల్లో జాగృతి నాయకురాలు కవిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి (CM) అవుతానని, 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని విషయాలపై విచారణ జరిపిస్తానని ఆమె సంచలన ప్రకటన చేశారు
- Author : Sudheer
Date : 12-12-2025 - 1:15 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాజకీయాల్లో జాగృతి నాయకురాలు కవిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి (CM) అవుతానని, 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని విషయాలపై విచారణ జరిపిస్తానని ఆమె సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన ద్వారా ఆమె తన రాజకీయ ఆకాంక్షను బహిరంగంగా వ్యక్తం చేయడంతో పాటు, గత పదేళ్ల పాలనలో జరిగిన అంశాలను సమీక్షించే పదునైన హెచ్చరికను పంపారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుత అధికార పార్టీతో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకుల్లోనూ కలకలం సృష్టించాయి.
తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను కవిత గట్టిగా ఖండించారు. “పదేళ్లలో నేను ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు” అని స్పష్టం చేస్తూ “మీ అవినీతిని నాపై రుద్దొద్దు” అంటూ ఆరోపణలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో తమపై ఆరోపణలు చేస్తున్న నేతలను ఉద్దేశించి “మీ అవినీతి చిట్టా చెప్పడం మొదలు పెట్టకముందే ఎందుకు భయపడుతున్నారు?” అని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో అంతర్గతంగా ఉన్న విభేదాలు, నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరాటం బహిర్గతమవుతున్నాయని సూచిస్తున్నాయి.
Pawan Kalyan : ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్ పిటిషన్
కవిత బీఆర్ఎస్ పాలనలో జరిగిన కొన్ని విధాన నిర్ణయాలపై కూడా విమర్శనాత్మకంగా మాట్లాడారు. “బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమల భూమిని నివాస భూములుగా మార్చారు” అని ఆరోపిస్తూ,..ఇప్పుడు హిల్ట్ పాలసీపై ఎందుకు మాట్లాడుతున్నారు?” అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. తనపై ఎదురవుతున్న రాజకీయ దాడిని తిప్పికొట్టడానికి ప్రయత్నించడంతో పాటు, భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టి, ప్రక్షాళన చర్యలు చేపడతాననే సందేశాన్ని బలంగా పంపించారు. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.