Hydra Demolition : కొండాపూర్లో హైడ్రా భారీగా కూల్చివేతలు
Hydra Demolition : హైదరాబాద్‌లో పెరుగుతున్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఈ మధ్యనే పలు ప్రాంతాల్లో ఇలాంటి కూల్చివేతలు చేపట్టింది. భిక్షపతి నగర్ ఘటనతో
- By Sudheer Published Date - 09:34 AM, Sat - 4 October 25

హైదరాబాద్‌లో హైడ్రా (Hydra ) బృందం మరోసారి పెద్ద ఎత్తున కూల్చివేతల చర్యలకు దిగింది. కొండాపూర్‌లోని ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఉన్న భిక్షపతి నగర్‌లో అనధికారికంగా నిర్మించిన నిర్మాణాలను భారీ బందోబస్తు మధ్య కూల్చివేసింది. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో అక్రమంగా పెరుగుతున్న నిర్మాణాలపై స్థానికులు పలు సార్లు ఫిర్యాదులు చేయడంతో అధికారులు కఠినంగా వ్యవహరించడం ప్రారంభించారు.
Blood Pressure: బీపీ,గుండెపోటు సమస్యలు రాకూడదంటే మీ డైట్ లో కచ్చితంగా ఈ ఫుడ్స్ చేర్చుకోవాల్సిందే!
కూల్చివేతల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రెండు కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో కూల్చివేతల ప్రాంతానికి స్థానికులు, మీడియా ప్రతినిధులను అనుమతించకుండా అడ్డుకున్నారు. ఈ కఠిన చర్యలతో ఆ ప్రాంతం మొత్తం ఒకటే ఉత్కంఠ వాతావరణంలో ఉంది. అధికారులు కూల్చివేతలను ప్రశాంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా కదులుతున్నారు.
హైదరాబాద్‌లో పెరుగుతున్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఈ మధ్యనే పలు ప్రాంతాల్లో ఇలాంటి కూల్చివేతలు చేపట్టింది. భిక్షపతి నగర్ ఘటనతో మరోసారి ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం అక్రమ నిర్మాణాలపై ఎటువంటి సడలింపు ఇవ్వబోమన్న సంకేతం ఇచ్చింది. మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉన్నప్పటికీ, ఈ చర్యలతో నగరంలో రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణదారుల మధ్య ఆందోళన నెలకొంది.