Hydraa : మైలవరం టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయాన్ని కూల్చేసిన హైడ్రా
Hydraa : హైడ్రా అధికారులు మొత్తం 17 ఎకరాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు
- Author : Sudheer
Date : 19-04-2025 - 1:24 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ (Hyderabad) హఫీజ్ పేట (Hafiz Peta) ప్రాంతంలో భారీ స్థాయిలో జరుగుతున్న హైడ్రా (Hydraa)కూల్చివేతల కార్యక్రమంలో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Mylavaram TDP MLA Vasantha Krishna Prasad) కార్యాలయం కూడా ధ్వంసం అయింది. హైడ్రా అధికారులు మొత్తం 17 ఎకరాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన భూముల ఆక్రమణలు అడ్డుకోగలిగామని హైడ్రా తెలిపింది. అక్రమ నిర్మాణాలపై రాజీ లేని విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Arjun Son Of Vyjayanthi : ‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
కాగా, తన కార్యాలయం కూల్చివేతపై స్పందించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, 2005లోనే ఈ భూమిని తాము కొనుగోలు చేశామని, రంగారెడ్డి కలెక్టర్ అందించిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ఆధారంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను స్వయంగా కలసి, భూమికి సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించామని తెలిపారు. తమ భూమిపై ఎలాంటి వివాదాలు లేవని చెప్పారు.
అయితే అందుబాటులో ఉన్న సమాచారం, సర్టిఫికెట్లు చూపించినా కూడా తమ కార్యాలయం పూర్తిగా కూల్చేశారని వాపోతున్నారు టీడీపీ ఎమ్మెల్యే వసంత. దీనిపై రాజకీయ స్థాయిలో చర్చలు మొదలవుతున్నాయి. అధికార యంత్రాంగం చర్యలు న్యాయసమ్మతమైందేనా? లేదా రాజకీయ ఉద్దేశాలే దానికి కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.