Miss World 2025 : అందాల పోటీల కోసం అందంగా ముస్తాబు అవుతున్న హైదరాబాద్
Miss World 2025 : ఈ ఈవెంట్‌ను గౌరవప్రదంగా నిర్వహించేందుకు నగరాన్ని అందంగా ముస్తాబు చేసే పనులు మొదలుపెట్టారు
- Author : Sudheer
Date : 29-04-2025 - 9:59 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మిస్ వరల్డ్-2025 (Miss World 2025) పోటీలు ఈసారి హైదరాబాద్ (Hyderabad) నగరంలో జరగనున్నాయి. ఈ ఈవెంట్‌ను గౌరవప్రదంగా నిర్వహించేందుకు నగరాన్ని అందంగా ముస్తాబు చేసే పనులు మొదలుపెట్టారు. ముఖ్యంగా సచివాలయం, చార్మినార్, దుర్గం చెరువు వంటి ప్రముఖ ప్రాంతాల్లో విశ్వసుందరి కిరీటాన్ని ఆకర్షణీయమైన నమూనాల్లో ఏర్పాటు చేయాలని GHMC అధికారులు నిర్ణయించారు. ఈ ఏర్పాట్లు నగరానికి విశేష ఆకర్షణను తీసుకురానున్నాయి.
Parshuram Jayanti : గురువు శివుడు.. శిష్యుడు ద్రోణాచార్యుడు.. పరశురామ ది గ్రేట్
ట్యాంక్ బండ్, కేబీఆర్ పార్క్, అమీర్‌పేట్ తదితర ప్రముఖ ప్రాంతాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించనున్నారు. రాత్రి వేళల్లో నగరమే మరో ప్రపంచంగా మారేలా గ్లోబల్ లుక్ ఇవ్వాలని అధికారులు యత్నిస్తున్నారు. ఈ అన్ని ఏర్పాట్ల కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) రూ.1.79 కోట్ల బడ్జెట్‌ను మంజూరు చేసింది. వేడుకల సమయంలో నగరానికి వచ్చే దేశ విదేశీ అతిథులకు హైదరాబాద్ సంస్కృతి, ఆధునికత రెండింటి మేళవింపును చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
మిస్ వరల్డ్ పోటీలు మే 7 నుంచి మే 31 వరకు హైటెక్స్ ప్రాంగణంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించనుంది. నగర అభివృద్ధిని, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇది మంచి అవకాశంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. పోటీలు సమీపిస్తున్న కొద్దీ నగరంలో పండగ వాతావరణం నెలకొనడం గమనార్హం.