HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabad Focus As Political Capital

Hyderabad: దేశ రెండో రాజ‌కీయ కేంద్రంగా హైద‌రాబాద్‌?

హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. మూడేళ్ళ క్రితం జాతీయ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ కూడా దానికి ఒప్పుకున్నాడు.

  • Author : Siddartha Kallepelly Date : 12-01-2022 - 10:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr
Kcr

హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. మూడేళ్ళ క్రితం జాతీయ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ కూడా దానికి ఒప్పుకున్నాడు. ఢిల్లీ తరహాలో చేయడానికి మాత్రం ఆయన విముఖంగా ఉన్నాడు. ఆ క్రమంలో పొలిటికల్ సెకండ్ కేపిటల్ గా మార్చాలని ఎత్తుగడ వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ దిశగా బీజేపీని ఓడించడానికి దేశాన్ని ఏకంచేస్తానని ప్రకటించిన కేసీఆర్ మాటల వెనుక చాలా సీరియస్ ఇంటెన్షన్ ఉన్నట్లు కేసీఆర్ మూవ్మెంట్స్ చూస్తే అర్ధం అవుతోంది.రాష్ట్రాలపై ఢిల్లీ పెత్తనం ఏంటని, దేశం మొత్తానికి ఒకటే సుప్రీం కోర్టు ఉండడం ఏంటని గతంలో కేసీఆర్ ప్రశ్నించి ప్రాంతీయ పార్టీలనే కాకుండా దేశ ప్రజలని తనవైపు అట్రాక్ట్ చేసాడు. ప్రతిదానికి కేంద్రంపై ఆధారపడాల్సి వస్తొందని, కేంద్రం రాష్ట్రాలను బిచ్చగాళ్లుగా ట్రీట్ చేస్తోందని ఈ పద్దతి మారాలంటే సెంట్రలైజేషన్ ని బద్దలు కొట్టాలని కేసీఆర్ పలుమార్లు అంతర్గతంగా చర్చించడమే కాదు బహిరంగంగా కూడా ప్రకటించారు.

దేశానికి రెండో రాజాధాని ఉండాల్సిన అవసరముందని, అది హైదరాబాద్ ఐతే బాగుంటుందనే చర్చ చాలా రోజులుగా ఉంది. ఈ విషయాన్ని అంబెడ్కర్ కూడా రాజ్యాంగం రాసిన రోజే ప్రస్తావించాడు. ఆ మేరకు బీజేపీ మేనిఫెస్టో కూడా ఉంది. ఈ అంశంపైనే కేసీఆర్ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య వామపక్ష పార్టీల జాతీయనాయకులతో హైదరాబాద్ వేదికగా చర్చ జరపడం, దాని తర్వాత ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో జరిపిన చర్చల్లో కేంద్రం పెత్తనాన్ని బద్దలు కొట్టాలనే ఉమ్మడి అంశంపై మాట్లాడినట్లు సమాచారం. గతంలో హైదరాబాద్ లో కేసీఆర్ చర్చలు జరిపిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, జార్ఖండ్ నేత హేమంత్ సొరేన్ తో కూడా ఈ చర్చ ప్రధానంగా వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఫెడరల్ ఫ్రంట్ అవసరం, ఆవశ్యకత ప్రస్తుతం ఉందని భావిస్తోన్న కేసీఆర్ ఆ చర్చలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలప్పుడే ఫ్రంట్ పై ఫోకస్ చేసిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల ఆ ప్రయత్నాల్ని వాయిదా వేసాడు. ఇక ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలతో పాటు హైదరాబాద్ ని సెకండ్ పొలిటికల్ సెంటర్ గా నిలిపే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ చేసే ఈ ఫ్రంట్ ప్రయత్నంతో దేశ రాజకీయాల్లో కేసీఆర్ మైలేజ్ పెరగడంతో పాటు, పలు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతల సపోర్ట్ తో హైదరాబాద్ సెకండ్ పొలిటికల్ సెంటర్ గా ఎస్టాబ్లిష్ అయితే తర్వాతి కాలంలోనైనా హైదరాబాద్ దేశానికి సెకండ్ క్యాపిటల్ అయ్యే అవకాశాలుంటాయని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కానీ ఢిల్లీ తరహా రాజధానికి మాత్రమే బీజేపీ సై అనే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • federal front
  • hyderabad
  • kcr
  • second capital
  • telangana CM

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

  • Kalvakuntla Kavitha lashes out at KTR.

    kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd