HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabad Cops Are Stopping People On The Road Checking Whatsapp Chats For Ganja

Drugs and Ganja : వెహికల్స్ ఆపుతూ.. వాట్సాప్ చాట్స్ చెక్ చేస్తూ..!

గత పది, పదిహేను రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూసినా డ్రగ్స్ కు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. పోలీసుల దాడుల్లో లెక్కకు మించి గంజాయి, డ్రగ్స్ లభ్యమవుతుండటంతో తెలుగు రాష్ట్రాల ముఖమంత్రులు కఠిన చర్యలకు దిగుతున్నారు.

  • By Balu J Published Date - 03:32 PM, Thu - 28 October 21
  • daily-hunt

గత పది, పదిహేను రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూసినా డ్రగ్స్ కు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. పోలీసుల దాడుల్లో లెక్కకు మించి గంజాయి, డ్రగ్స్ లభ్యమవుతుండటంతో తెలుగు రాష్ట్రాల ముఖమంత్రులు కఠిన చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ గంజాయి సాగు చేస్తున్నవాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా గంజాయి సాగు చేసినట్టు రుజువైతే, ఆ భూములకు సంబంధించిన పట్టాలు, ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక ఏపీ సీఎం జగన్ విద్యాసంస్థల దగ్గర నిఘా పెట్టాలని, డ్రగ్స్ అణచివేయాలని సూచనలు చేశారు. డ్రగ్స్ వ్యవహరం తెలుగు రాష్ట్రాలకు తలనొప్పిగా మారడంతో హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు చెక్ పోస్టుల దగ్గర నిఘా వేసి అక్రమార్కులను అరెస్ట్ చేశారు. నిఘా పెంచినా డ్రగ్స్ దందా కు ఫుల్ స్టాప్ పడకపోవడంతో హైదరాబాద్ లోని పలు ప్రధాన రహదారులను చెక్ పాయింట్లుగా చేసుకొని వాహనాదారులకు చెక్ చేస్తున్నారు.

New policing practices alert: stop and search phone chats by the @hydcitypolice. Police are searching phone chats for words like ganja. Wait until they replace words with NRC, Modi or BJP. pic.twitter.com/1lNjvKRIgk

— Srinivas Kodali (@digitaldutta) October 27, 2021

 గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో గంజాయిని చలామణి చేస్తున్నవాళ్లను గుర్తించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్‌లో దాడులు, సోదాలు నిర్వహించాలని ‘కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌’ ఆదేశాల మేరకు పోలీసులు అలర్ట్ అయ్యారు. రోడ్లపై వాహనాలను ఆపడం, మొబైల్స్ ను చేతుల్లోకి తీసుకోవడం, సంబంధిత చాట్‌లు ఉన్నాయో లేదోనని చెక్ చేయడం లాంటివి చేస్తున్నారు. అంతేకాకుండా.. మొబైల్స్ లో గంజాయి లాంటి కీపింగ్ పదాలను కూడా చెక్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల వీడియో ఒకటి బయటకు వచ్చింది. అయితే వాట్సాప్ చాట్స్ చెక్ చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గజరావు భూపాల్ మాట్లాడారు. ‘‘ఫోన్‌లను తనిఖీ చేస్తున్నట్లు నాకు తెలుసు. అయితే, మేము ఎవరినీ బలవంతం చేయడం లేదు. తనిఖీల పేరుతో ఫోన్స్ లాక్కోవడం లేదు. ప్రజలు సహకరిస్తున్నారు. కాబట్టి పోలీసులు తనిఖీ చేస్తున్నారు’’ అని సమాధానం ఇచ్చారు.

అయితే పోలీసులు అడిగినప్పుడు ప్రజలు తమ ఫోన్లను ఇవ్వకుండా తిరస్కరించే అవకాశం ఉందా అని అడిగినప్పుడు “ తమ ఫోన్‌ను ఇవ్వడాన్ని తిరస్కరించవచ్చు. అయితే, ఆ తర్వాత ఎలాంటి చట్టపరమైన నిబంధనలు వర్తిస్తాయో చూడాలి. ఇప్పటివరకు, మేము అలాంటి సమస్యను ఎదుర్కోలేదు. ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. వస్తే పరిశీలిస్తాం’’ అని అన్నారు. అయితే ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత అంతర్గతంగా ఉంటుందని, రాజ్యాంగంలోని పార్ట్ III కింద హామీ ఇవ్వబడిన ఇతర స్వేచ్ఛలు అని కోర్టు పేర్కొంది. తెలంగాణ హైకోర్టు న్యాయవాది కారం కొమిరెడ్డి మాట్లాడుతూ..  ఫోన్‌లను తనిఖీ చేయడానికి పోలీసులు ఏ చర్య తీసుకున్నా గోప్యతకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. వ్యక్తుల ఫోన్‌లను యాదృచ్ఛికంగా తనిఖీ చేసే హక్కు పోలీసులకు ఉండదు. పౌరుల అనుమతి లేకుండా ఫోన్లను చెక్ చేయడం చట్ట విరుద్దం అన్నారు. 

*గంజాయి రవాణా – వాస్తవ పరిస్థితులు : డిఐజి రంగనాధ్*@TelanganaDGP @TelanganaCOPs pic.twitter.com/g3eaWDAC4A

— Nalgonda District Police (@SP_Nalgonda) October 28, 2021

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chats
  • checking
  • in telengana
  • police
  • whatsapp

Related News

Brs Office Manuguru

Section 144 : మణుగూరులో 144 సెక్షన్ అమలు

Section 144 : మణుగూరు తెలంగాణ భవన్‌పై జరిగిన దాడి ఘటనతో స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉందన్న సమాచారం

    Latest News

    • Caffeine: రోజుకు ఎన్ని కప్పుల కాఫీ/టీ తాగడం సురక్షితం?

    • Prevent Heart Attack: భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదం!

    • Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

    • Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన‌ తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!

    • 8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!

    Trending News

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd