Sandeep Sandilya : సీపీ సందీప్ శాండిల్యకు అస్వస్థత.. క్షేమంగానే ఉన్నానంటూ సెల్ఫీ వీడియో
Sandeep Sandilya : హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య అస్వస్థతకు గురయ్యారు.
- By pasha Published Date - 06:32 PM, Mon - 20 November 23

Sandeep Sandilya : హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య అస్వస్థతకు గురయ్యారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని పాత సీపీ కార్యాలయంలో ఉండగా ఆయన ఛాతీనొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో వెంటనే శాండిల్యను హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. మరికొన్ని పరీక్షలు చేయాల్సి అవసరం ఉందని తెలిపారు.ఈనేపథ్యంలో తాను క్షేమంగానే ఉన్నానంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. మగతగా ఉండటంతో ఆస్పత్రికి వచ్చానని, పెద్దగా సమస్యేం లేదని స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవలే హైదరాబాద్ సీపీగా శాండిల్య నియమితులయ్యారు. ఎన్నికల నేపథ్యంలో భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ఈ నెల 30న పోలింగ్ జరగనున్న విషయం(Sandeep Sandilya) తెలిసిందే.
Related News

1000 Crore Seize : 5 పోల్ రాష్ట్రాల్లో 1000 కోట్ల క్యాష్ సీజ్.. తెలంగాణలో ?
1000 Crore Seize : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ జోరుగా ధన ప్రవాహం జరుగుతోంది.