Wanaparthy : వనపర్తి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..70 వేల ధాన్యం బస్తాలు దగ్ధం
మున్సిపల్ కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని.. 70 వేల ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి
- Author : Sudheer
Date : 01-04-2024 - 10:32 IST
Published By : Hashtagu Telugu Desk
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మున్సిపల్ కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని.. 70 వేల ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే 40 లక్షల గన్నీ బ్యాగులు కాలి బూడిద అయ్యాయి. వీటి విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది..ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగి ఉంటుందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. వెంటనే అధికారులు మార్కెట్ కు వెళ్లి పరిశీలించాలని, ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె రైతుబంధు ఫై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేసారు. రైతుబంధు ఎవరికి ఏ విధంగా ఇవ్వాలనే అంశంపై వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామని అన్నారు. వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. ఈ నెలాఖరు వరకు అర్హులందరికీ రైతుబంధు సాయాన్ని అందజేస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల సన్నాయిగూడెంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసారు.
Read Also : Whatsapp Update: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. కొత్త అప్డేట్ తో ఆ సమస్యకి చెక్?