Huge Betting : తెలంగాణ ప్రజలు ఎవరికీ పట్టం కడతారనేదానిపై జోరుగా బెట్టింగ్
ఈసారి ఎవరికీ ఓటు వేస్తున్నావు..? ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నావ్..? ఎవరు సీఎం అవుతారు..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ప్రజలు బిఆర్ఎస్ ను మరోసారి నమ్ముతారా..?
- Author : Sudheer
Date : 29-11-2023 - 11:43 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ర అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections 2023) రేపు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ (BRS) పార్టీ కి మరో ఛాన్స్ ఇస్తారా..? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ (Congress) పార్టీ కి జై కొడతారా..? కేంద్రంలో ఉన్న బీజేపీ (BJP) ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారా..? అనేది తెలుసుకోవాలని ఆసక్తి గా ఉన్నారు.
119 నియోజకవర్గాలకు సంబదించిన పోలింగ్ రేపు పూర్తి అవుతుంది..డిసెంబర్ 03 న ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. ఈ తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫై జోరుగా బెట్టింగ్ లు మొదలయ్యాయి. ఎక్కడ చూడు..ఎక్కడికి వెళ్లిన..ఓ నలుగురు కూర్చుని మాట్లాడిన ఇలా అంత కూడా ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఎవరికీ ఓటు వేస్తున్నావు..? ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నావ్..? ఎవరు సీఎం అవుతారు..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ప్రజలు బిఆర్ఎస్ ను మరోసారి నమ్ముతారా..? కాంగ్రెస్ గ్యారెంటీ హామీలు వర్క్ అవుట్ అవుతాయా..? ఇలా రకరకాల వాటిపై చర్చిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ ప్రజలతో పాటు.. చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరికి వారు తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటూ పలువురు బెట్టింగ్ (Huge Betting ) కడుతున్నారు. వందకు వెయ్యి, వెయ్యికి లక్ష అంటూ వేలం పాట పాడుతున్నారు. ఇక పెద్ద లీడర్లు తలపడుతున్న నియోజకవర్గాల్లో అయితే.. ఎవరు ఎంత మెజార్టీతో గెలుస్తారనే విషయంపై లక్షల్లో బెట్టింగ్స్ నడుస్తున్నాయి. ఇక ఏపీలో అయితే సంక్రాతి మాదిరి కోడి పందేలు వేసుకుంటూ బెట్టింగ్ కాస్తున్నారు. ప్రధాన పార్టీల గెలుపోటములపై జోరుగా పందేలు కాస్తున్నారు. పార్టీలతో పాటు కీలక నేతల జయాపజయాలపై కూడా బెట్టింగ్ కాస్తున్నారు. కొందరు వ్యక్తిగత స్థాయిలో పందేలు కాస్తుండగా.. మరికొందరు సిండికేట్‌గా పందేలు కడుతున్నారు. ఒక పార్టీ లేదా అభ్యర్థి గెలుస్తున్నారని భావిస్తే ఒకరు కాకుండా ఒక సమూహం 10 లేదా 25 మాది గ్రూప్‌తో సిండికేట్‌గా మారి లక్షలలో బెట్ కడుతున్నారు. గెలిస్తే అందులో వారి వాటా ఎంతో అంత వస్తుంది. పోతే మొత్తం పోతుంది. వ్యక్తిగతంగా అయినా, సిండికేట్ ద్వారా అయినా.. చాలా మంది రూ.లక్షలు, కోట్లల్లో పందేలు కాస్తున్నారు. కొందరైతే.. వ్యవసాయ భూములు, ఇళ్లను కూడా పందెంగా పెడుతున్నట్టు వినికిడి. మరి ఎవరు ప్రజలు పట్టం కడతారనేది చూడాలి.
Read Also : BRS : దేవుడిపై ప్రమాణం చేయించి..డబ్బులు పంచుతున్న బిఆర్ఎస్ శ్రేణులు