HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >House And Flat Prices Have Increased Drastically In Hyderabad

హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్లు,ఫ్లాట్ల ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 16-02-2026 - 10:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Land Rent
Hyderabad Land Rent

Hyderabad  కొవిడ్ తర్వాత 2023-24లో రియల్ ఎస్టేట్ మార్కెట్ గరిష్ఠ స్థాయికి చేరగా.. మళ్లీ కొంత కాలంగా ఫ్లాట్‌గానే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలోనే గతేడాది ఇళ్లు లేదా ఫ్లాట్స్ ధరలు ఓ మోస్తరుగానే పెరిగాయి. ఈ మేరకు ప్రాప్‌టైగర్ ఒక రిపోర్ట్ వెలువరించగా దేశంలోని ఏ నగరంలో ధరలు ఏ స్థాయిలో పెరిగాయో మనం ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో ఇళ్లు/ఫ్లాట్స్ ధరలు 2025 సంవత్సరంల మోస్తరుగా పెరిగాయి. 2024తో పోలిస్తే 2025లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు సగటున వార్షిక ప్రాతిపదికన 6 శాతం వరకు పెరిగాయి. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌టైగర్ ఒక నివేదిక విడుదల చేసింది. అయితే అంతకుముందు 2024లో మాత్రం ఏకంగా 17 శాతం వరకు పెరిగాయి. 2024తో పోలిస్తే 2025లో ఇళ్ల ధరలు అంతలా పెరగలేదన్నమాట. మరి ఏయే నగరాల్లో ధరలు ఏ స్థాయిలో పెరిగాయి.. ప్రాప్ టైగర్ ప్రకారం చదరపు అడుగుకు ఎక్కడ ధర ఎంత పలుకుతుందనేది తెలుసుకుందాం.

దేశ రాజధాని నగరం ఢిల్లీ- NCR ప్రాంతంలో ఇళ్ల ధరలు సగటున 6 శాతం పెరిగినట్లు ప్రాప్‌టైగర్ తెలిపింది. అంతకుముందు సంవత్సరంలో ఏకంగా 49 శాతం పెరగడం గమనార్హం. ఒక్కసారిగా రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్ తగ్గడమే కారణంగా తెలుస్తోంది. అత్యధికంగా బెంగళూరులో ఇళ్ల ధరలు పెరగ్గా.. చెన్నైలో మాత్రం స్థిరంగా ఉన్నాయి.

దేశంలోని ఇతర నగరాల్లో చూస్తే హైదరాబాద్ నగరంలో సగటున ఇళ్ల ధరలు 8 శాతం పెరగ్గా చదరపు అడుగుకు 2025లో రూ. 7,644 కు చేరింది. అంతకుముందు 2024లో చదరపు అడుగు ధర రూ. 7053 గానే ఉంది. అహ్మదాబాద్‌లో ఇళ్లు లేదా ఫ్లాట్ల ధర సగటున 8 శాతం పెరిగి చదరపు అడుగుకు 4,754 కు చేరింది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో (MMR) 4 శాతం మేర ధరలు పెరిగి చదరపు అడుగుకు రూ. 13,164 వద్ద ఉంది.

ఢిల్లీ- NCR ప్రాంతంలో అంతకుముందు 2024లో చదరపు అడుగు ధర రూ. 8,105 గా ఉండగా.. ఇది 2025లో రూ. 8,570 కు ఎగబాకింది. ఇక్కడ 2022-24 మధ్య ధరలు విపరీతంగా పెరగడంతో.. ఇప్పుడు డిమాండ్ తగ్గగా ధరలు అంతలా పెరగలేదని రిపోర్ట్ పేర్కొంది. కోల్‌కతాలో కూడా ఇళ్ల ధరలు సగటున 6 శాతం పెరిగి చదరపు అడుగుకు ప్రస్తుతం రూ. 5,945 గా ఉంది. బెంగళూరు నగరంలో 13 శాతం మేర ఇళ్ల ధరలు పెరగ్గా.. చదరపు అడుగుకు రూ. 7,536 నుంచి రూ. 8,533 కు పెరిగింది. ఇక చెన్నై నగరంలో చదరపు అడుగు ధర రూ. 7,200 గా ఉండగా.. ఇది దాదాపు 2024 ధరలతో సమానంగానే ఉందని తెలుస్తోంది. అయితే టెక్ హబ్స్, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ల ఏర్పాటుతో మౌలిక సదుపాయాల కల్పన మెరుగ్గా ఉన్న నగరాల్లో ఇళ్లకు డిమాండ్ ఉంటుందని.. ధరలు కూడా పెరుగుతాయని రిపోర్ట్ అంచనా వేస్తోంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • house rent
  • Housing Prices
  • Huge house Rent Hikes
  • hyderabad
  • hyderabad house rent
  • hyderabad house rent price
  • hyderabad Property
  • Lands Prices
  • telangana lands price
  • Telangana Lands Prices

Related News

Purepower

PuREPower : హైదరాబాద్‌లో నూతన షోరూమ్ ప్రారంభం

రాబోయే 30 నెలల్లో దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించాలని ప్యూర్ ఈవీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న కేంద్రాలను 320కి పైగా పెంచే క్రమంలో, కొత్తగా 250 డీలర్‌షిప్‌లను ప్రారంభించనుంది. ముఖ్యంగా బి2బి (B2B) విభాగంలో లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ వాహనాలకు

  • mega family ram charan upasana twins naming ceremony

    రామ్‌చరణ్‌,ఉపాసన కవలల పేర్లు ఇవే!

  • Old City Hyderabad

    హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న రౌడీ గ్యాంగ్

  • Cars24 Hyd

    CARS24 : హైదరాబాద్‌లో కార్స్24 సరికొత్త రికార్డులు

  • CM Revanth Reddy

    రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్‌ విభజన

Latest News

  • భారత్‌ చేతిలో ఓటమి కారణం ఇదే.. కోచ్ సంచలన వ్యాఖ్యలు!

  • Uttam & Shivakumar : బేగంపేట విమానాశ్రయంలో డి.కె. శివకుమార్ తో మంత్రి ఉత్తమ్ భేటీ

  • కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

  • ఆరోగ్య సిరి..తేనెలో ఉసిరికాయ‌ల‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

  • Aswaraopeta Municipality : అశ్వారావుపేటలో రికార్డ్.. భార్యాభర్తలే ఛైర్మన్, వైస్ ఛైర్మన్

Trending News

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd