HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Holiday Declared For All Schools

Rain Effect : తెలంగాణ లో రేపు విద్యాసంస్థలకు సెలవు

24 గంటల పాటు అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రభుత్వ , ప్రవైట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.

  • Author : Sudheer Date : 01-09-2024 - 2:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rains Effect Holiday
Rains Effect Holiday

తెలంగాణ వ్యాప్తంగా (Telangana) రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు (Rains ) కురుస్తున్న సంగతి తెలిసిందే. మరో 24 గంటల పాటు అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రభుత్వ , ప్రవైట్ విద్యాసంస్థలకు సెలవు (Holiday declared for all schools) ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వర్షం, వరదలో సెల్ఫీల కోసం యువత ప్రాణాలను పణంగా పెట్టొద్దని సూచించారు. అటు నేషనల్ హైవేలపై వరద ప్రవహిస్తోందని, చాలా ప్రాంతాల్లో పంటపొలాలు నీట మునిగినట్లు చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

భారీ వర్షాల నేపథ్యంలో సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడం తో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టవద్దని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. సెలవులు పెట్టిన వారు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. బాధితుల కోసం అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. ఖమ్మం, సూర్యాపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయన్నారు. పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయన్నారు. కొన్ని చోట్ల హైవేలపై నీరు చేరిందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయికి వెళ్లి సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని కోరారు. అనేక చోట్ల పంటపొలాలు నీటమునిగాయన్నారు.

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని.. లీవ్ అప్లై చేసిన వారు వెంటనే రద్దు చేసుకొని పనుల్లో నిమగ్నం కావాలన్నారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంవోకు అందించాలని రేవంత్ ఆదేశించారు.

Read Also : Khammam Rains: ఖమ్మం ఆకేరు వాగులో ఐదుగురు యువకులు గల్లంతు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • all schools
  • Holiday declared
  • rains
  • telangana

Related News

Pavan Kalyan (1)

JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

రేపు (జూన్ 2వ) గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో జరగాల్సిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ రాజకీయ రంగంలో పార్టీ ఉనికిని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొంటార

  • Heavy Rain Forecast for Telangana

    Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Komatireddy

    Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

Latest News

  • NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

  • Cockroach Janata Party: భారత్‌కు రానున్న కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

  • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

  • CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

  • Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్‌.. విమానం యూటర్న్‌.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd