HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >High Temperature In Telangana

High Temperature : తెలంగాణలో అప్పుడే భగభగలు స్టార్ట్

High Temperature : సోమవారం ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 36.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది

  • Author : Sudheer Date : 04-02-2025 - 6:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
High Temperature
High Temperature

తెలంగాణలో ఎండాకాలం ప్రభావం మొదలైనట్లు కనిపిస్తోంది. సాధారణంగా ఫిబ్రవరిలో చలిగాలులు కొనసాగాలి కానీ, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుని, ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగటి సమయంలో భానుడి భగభగలు, రాత్రివేళలోనూ ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న ఎండల ప్రభావం ఇప్పటికే చాలా జిల్లాల్లో కనిపిస్తోంది. సోమవారం ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 36.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, మెదక్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి వేడిగా ఉంటున్నాయి. ఫిబ్రవరి నెలలోనే 34-37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవ్వడం విస్మయానికి గురిచేస్తోంది.

వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల ప్రకారం.. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే 15-20 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పొడి వాతావరణం కారణంగా అలర్జీలు వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అధిక ఎండల వల్ల నీటి శాతం తగ్గే అవకాశం ఉండటంతో, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లోనూ, బయటనూ అధిక వేడిమి కారణంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగడం మొదలైంది. జనవరి చివరి వారం నుంచే ఎండలు దంచికొట్టడం మొదలవడంతో, ప్రజలు బయట తిరగడానికి భయపడిపోతున్నారు. ఇంట్లోనూ ఉక్కపోత పెరగడంతో ఫ్యాన్స్, ఏసీలు, కూలర్లు వాడడం మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఇప్పుడే ఇంత వేడి ఉంటే, ఏప్రిల్ , మే లలో వేసవిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే ఈ సంవత్సరం వేసవి తక్కువ సమయానికే ప్రారంభమై, అధిక ఉష్ణోగ్రతలతో విరుచుకుపడుతుండటం అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • high temperature
  • telangana
  • Temperature

Related News

Heavy Rain Forecast for Telangana

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం (జూన్ 8) ఇవి దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • Janasena will contest in Telangana.

    Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

Latest News

  • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

  • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

  • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

  • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

  • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd