HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >High Alert In Old City Police Impose Traffic Restrictions Fearing Violence

High Alert in Old City: పాత‌బ‌స్తీలో హైఅలర్ట్ ,ట్రాఫిక్ ఆంక్ష‌లు

పాత‌బ‌స్తీలో శాంతి భ‌ద్ర‌త‌ల దృష్ట్యా పోలీసులు హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఓల్డ్ సిటీకి వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. పాత‌బ‌స్తీతో పాటు సౌత్ జోన్‌లో ఈ ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.

  • Author : CS Rao Date : 24-08-2022 - 9:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Traffic Restriction Imresizer
Traffic Restriction Imresizer

పాత‌బ‌స్తీలో శాంతి భ‌ద్ర‌త‌ల దృష్ట్యా పోలీసులు హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఓల్డ్ సిటీకి వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. పాత‌బ‌స్తీతో పాటు సౌత్ జోన్‌లో ఈ ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.

-పురానాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి, చాద‌ర్‌ఘాట్ బ్రిడ్జి, చాద‌ర్‌ఘాట్ కాజ్‌వే, ముసారాంబాగ్ బ్రిడ్జి నుంచి ఓల్డ్ సిటీ, మ‌ల‌క్‌పేట్‌, ఎల్బీన‌గ‌ర్‌కు వెళ్లే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు.

-ఎంజే మార్కెట్ నుంచి న‌యాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, పురానాపూల్ బ్రిడ్జి నుంచి ఓల్డ్ సిటీకి వేళ్లే దారుల్లో కూడా పోలీసులు ఆంక్ష‌లు విధించారు. ఈ దారుల్లో వెళ్లే వారు 100 ఫీట్ రోడ్డు, జియ‌గూడ‌, రామ్‌సింగ్‌పురా, అత్తాపూర్, ఆరాంఘ‌ర్, మైలార్‌దేవ్‌ప‌ల్లి, చాంద్రాయ‌ణ‌గుట్ట మీదుగా త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవ‌చ్చు.

-ఎంజే మార్కెట్ నుంచి న‌యాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి మీదుగా ఓల్డ్ సిటీకి చేరుకునే వారు.. రంగ‌మ‌హ‌ల్‌, చాద‌ర్‌ఘాట్‌, నింబోలిఅడ్డ‌, టూరిస్ట్ జంక్ష‌న్, బ‌ర్క‌త్‌పురా, ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌, విద్యాన‌గ‌ర్‌, తార్నాక మీదుగా చేరుకోవాలి.

-అబిడ్స్, కోఠి నుంచి ఎల్బీన‌గ‌ర్‌, మ‌ల‌క్‌పేట్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వెళ్లే వాహ‌న‌దారులు.. నింబోలిఅడ్డ‌, టూరిస్ట్ జంక్ష‌న్, బ‌ర్క‌త్‌పురా, ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌, విద్యాన‌గ‌ర్‌, తార్నాక లేదా 6 నంబ‌ర్, రామంతాపూర్ మీదుగా చేరుకోవాలి.

-ఓల్డ్ సిటీ నుంచి అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్‌, ల‌క్డీకాపూల్ వైపు వెళ్లే వారు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని సూచించారు. చాంద్రాయ‌ణగుట్ట‌, మైలార్‌దేవ్‌ప‌ల్లి, ఆరాంఘ‌ర్, అత్తాపూర్, మెహిదీప‌ట్నం, మాసాబ్‌ట్యాంక్‌, ల‌క్డీకాపూల్ చేరుకోవ‌చ్చు.

-దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, ఎల్బీన‌గ‌ర్ నుంచి అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్ వెళ్లే వాహ‌న‌దారులు.. ఉప్ప‌ల్, తార్నాక‌, విద్యాన‌గ‌ర్, ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌, బ‌ర్క‌త్‌పురా మీదుగా ప్ర‌యాణించొచ్చు.

T R A F F I C A D V I S O R Y
In view of the prevailing L&O situation and ongoing agitations in South Zone/Old City, the general traffic will be diverted on need basis w.e.f. 24-08-2022.https://t.co/uZWy5rrv0M pic.twitter.com/CJfibXvtYT

— Hyderabad City Police (@hydcitypolice) August 24, 2022

#Hyderabad: #Oldcity pur aman tareeqe Se band | Nazara hai #Dabeerpura Darwaza Se..
Sho aur SI Ki Kadi Nigrani…@shodabeerpura @hydcitypolice pic.twitter.com/vE3KlxtU9C

— M.A.SAMI@imran (@Meet_MA_Sami) August 24, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • high alert in old city
  • hyderabad
  • Prophet remarks row
  • traffic restrictions

Related News

HYDRAA

HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. చెరువు మధ్యలో నిర్మించిన ఆక్రమణలు, గుడిసెలు, కట్టలను అధికారులు తొలగించి చెరువు సరిహద్దులను రక్షించే చర్యలు ప్రారంభించారు. ముష్కిన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సుమారు ₹5,500 కోట్ల విలువైన భూమి ఉంది. చెరువు భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్‌ఎండిఏ రికా

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd