Heavy Rain in HYD : మానవ తప్పిదాలతో మునిగిపోతున్న హైదరాబాద్
Heavy Rain in HYD : 1989లో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను 2021 జనాభా అంచనాలకూ సరిపడేలా ఎప్పుడూ మార్చకపోవడం, డ్రైనేజీ సిస్టంను విస్తరించకపోవడం పెద్ద లోపం
- By Sudheer Published Date - 11:45 AM, Thu - 18 September 25

హైదరాబాద్ (Hyderabad) నగరం ప్రతీ ఏడాది వర్షాకాలం వస్తే వరదలతో మునిగిపోతోంది. ఇది సహజ విపత్తు కంటే ఎక్కువగా మానవ తప్పిదాల ఫలితమని నిపుణులు చెబుతున్నారు. 1989లో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను 2021 జనాభా అంచనాలకూ సరిపడేలా ఎప్పుడూ మార్చకపోవడం, డ్రైనేజీ సిస్టంను విస్తరించకపోవడం పెద్ద లోపం. ఏ ప్రభుత్వం వచ్చినా సమస్యలను గుర్తించినా, సమగ్ర పరిష్కారం దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.
Gold Price : తగ్గిన బంగారం ధరలు..ఈరోజు తులం ఎంత ఉందంటే !!
2015లో డ్రైనేజీ సిస్టంను బలోపేతం చేయాలని ప్రతిపాదనలు చేసినా, నిధుల కొరత కారణంగా అవి అమలు కాలేదు. ఫలితంగా ప్రతి సంవత్సరం వర్షాలు కురిసే కొద్దీ ప్రధాన రోడ్లపై నీటిమునిగిపోవడం, పాత బస్తీలు, లోతట్టు ప్రాంతాలు వరదలతో ఇబ్బందులు పడడం సర్వసాధారణమైంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, సక్రమ ప్రణాళికల లేమి కారణంగా సాధారణ వర్షానికే నగరం సతమతమవుతోంది.
ఇక చెరువులు, నాలాలను కబ్జా చేసి భవనాలు నిర్మించడం పరిస్థితిని మరింత దిగజార్చింది. సహజంగా వరదనీటిని తట్టుకోగలిగే ఈ జలమార్గాలు మూసుకుపోవడంతో వర్షం కురిసిన వెంటనే నీరు రోడ్లపైకి, ఇళ్లలోకి చేరుతోంది. నగర అభివృద్ధి పేరుతో జరిగే నిర్లక్ష్యం, అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. సహజ వనరులను కాపాడుకోవడం, శాస్త్రీయ ప్రణాళికతో నగర మౌలిక వసతులను మెరుగుపరచడం తప్పనిసరి అని ఈ వరదలు మరోసారి స్పష్టంచేశాయి.