Rain : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో దంచికొడుతున్న వర్షం
Rain : తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం,
- By Sudheer Published Date - 07:06 PM, Thu - 17 July 25

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. 4 గంటల ముందు వరకు విపరీతమైన ఎండ కొట్టగా..సాయంత్రం సడెన్ గా భారీ వర్షం మొదలైంది. మాదాపూర్, శేరిలింగంపల్లి, కంటోన్మెంట్, హకీంపేట, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో భారీ వర్షం కురిసింది. వర్షాభావ పరిస్థితుల్లో అలమటిస్తున్న నగర ప్రజలకు ఈ వాన కొంత ఉపశమనం కలిగించినా, రహదారులపై నీటి నిల్వలు, ట్రాఫిక్ అడ్డంకులతో జనం తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు.
వచ్చే నాలుగు రోజులు వర్షాలు – వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా నివేదిక ప్రకారం.. రాబోయే నాలుగు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు (Rains ) కురిసే అవకాశం ఉంది. గురువారం నాడు ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అలాగే మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.
జిల్లాల వారీగా వర్ష సూచనలు
శుక్రవారం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. శనివారం వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఆదివారం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలపై వాన ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఎల్లో అలెర్ట్ జారీ – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వర్ష సూచనల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రజలు ప్రయాణాలు చేయాల్సిన సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
SALT : కూరల్లో ఏ ఉప్పు వాడుతున్నారు.. ఆరోగ్యానికి ఏది మంచిది.. ఏది కాదు!