BRS Silver Jubilee : బీఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభ వేడుక ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయంటే..!
BRS Silver Jubilee : లక్షలాది మంది హాజరయ్యే ఈ మహాసభ కోసం 120 ఫీట్ల పొడవు, 80 ఫీట్ల వెడల్పుతో బహుళ విస్తీర్ణంలో వేదిక నిర్మాణం జరుగుతోంది
- By Sudheer Published Date - 02:45 PM, Wed - 16 April 25

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సభను గతంలో బీఆర్‌ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభల తరహాలో అద్భుతంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. లక్షలాది మంది హాజరయ్యే ఈ మహాసభ కోసం 120 ఫీట్ల పొడవు, 80 ఫీట్ల వెడల్పుతో బహుళ విస్తీర్ణంలో వేదిక నిర్మాణం జరుగుతోంది. దాదాపు 50 వేల వాహనాల్లో జనసందోహం వచ్చేది కాబట్టి, 1,213 ఎకరాల్లో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో 154 ఎకరాలు సభ ప్రాంగణానికి, మిగిలిన 1,059 ఎకరాలు పార్కింగ్ వసతులకు కేటాయించారు.
Dogs Crematorium : ఇక కుక్కలు, పిల్లులకూ శ్మశానవాటిక.. సర్వీసుల వివరాలివీ
ఎల్కతుర్తిలో ఇప్పటికే ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు అభివృద్ధి చేసి సభకు అనుకూలంగా మార్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రావడానికి అనువుగా ఉన్న జాతీయ రహదారులతో ఎల్కతుర్తి కేంద్ర బిందువుగా మారింది. ఈ సభ ఏర్పాట్లను బీఆర్‌ఎస్ నేతలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, వొడితల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు లాంటి నాయకుల ఆధ్వర్యంలో చురుగ్గా కొనసాగిస్తున్నారు. కేసీఆర్ సూచనల మేరకు వేగంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
తెలంగాణ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే సభగా అభివర్ణన
బీఆర్‌ఎస్ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, ఉద్యమ చరిత్ర, అభివృద్ధి దశలను ప్రదర్శించే ఈ సభ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై ఆశాభావం కలిగించేలా ఉండనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తుచేస్తూ, మళ్లీ బీఆర్‌ఎస్ భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండగలదనే సందేశాన్ని ఈ సభ అందించనుంది. 2001లో ఆవిర్భవించిన బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ సాధనతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించగా, 2014 తర్వాత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది. ఈ నేపథ్యంతో ఏప్రిల్ 27న జరగనున్న రజతోత్సవ సభ బీఆర్‌ఎస్ కోసం రాజకీయంగా కీలకంగా మారనుంది.