TSRTC: చెప్పచేయకుండా ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఛార్జీలు పెంచారా..?
TSRTC: బస్సుల్లో టికెట్ల ధరలు రూ.10 మేర అదనంగా వసూలు చేస్తున్నారని, దీనిపై సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సందేహాలు పెరుగుతున్నాయి
- By Sudheer Published Date - 08:56 AM, Thu - 19 June 25

తెలంగాణలో టీఎస్ ఆర్‌టీసీ (TSRTC) నిర్వహిస్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో టికెట్ ఛార్జీలు (Ticket fares on Express buses) పెరిగాయంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బస్సుల్లో టికెట్ల ధరలు రూ.10 మేర అదనంగా వసూలు చేస్తున్నారని, దీనిపై సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సందేహాలు పెరుగుతున్నాయి.
Jagan : చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు
ప్రస్తుతం టోల్ గేట్లు ఉన్న మార్గాల్లో ఇప్పటికే ఒక్కో టోల్‌కు రూ.10 చొప్పున వసూలు చేస్తున్నా మరోసారి ఛార్జీలు పెంపు ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తోంది. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో టోల్ ఛార్జీలతో పాటు కిలోమీటర్ల ఆధారంగా ‘రేషనలైజేషన్’ పేరుతో ధరలను పెంచినట్లు తెలుస్తోంది. ఇది ప్రయాణదూరంతో సంబంధం లేకుండా ఛార్జీలు మారుతున్నట్టుగా ప్రయాణికులు పేర్కొంటున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో టీఎస్‌ఆర్‌టీసీ అధికారుల నుంచి సరైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అధికారికంగా ధరలు పెంచారా? లేక ఎక్కడైనా తప్పుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారా? అనే అంశాలపై సంస్థ స్పందించకపోవడం ప్రయాణికుల్లో అసంతృప్తికి దారి తీస్తోంది. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి తగిన ప్రకటన చేయాలని వారు కోరుతున్నారు.