Telangana Assembly : హరీష్ రావు కు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కౌంటర్
Telangana Assembly : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు (Harishrao) లేచి సభకు కొంతమంది సభ్యులు పొద్దునే తాగి వస్తున్నారని, అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు పెట్టాలని వ్యాఖ్యానించారు.
- By Sudheer Published Date - 02:00 PM, Wed - 18 December 24

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో బుధవారం జరిగిన చర్చలో డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive) పై ప్రధానంగా చర్చకు వచ్చింది. రహదారుల భద్రతపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) సీరియస్‌గా మాట్లాడుతుండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు (Harishrao) లేచి సభకు కొంతమంది సభ్యులు పొద్దునే తాగి వస్తున్నారని, అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు పెట్టాలని వ్యాఖ్యానించారు.
హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య(MLA Birla Ailaiah Counter) వెంటనే కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ఎక్కడైనా ఫాంహౌస్‌లో తాగి ఉండవచ్చని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో సభలో అధికార-విపక్షాల మధ్య గందరగోళం నెలకొనేలా చేసింది. అగ్గిపెట్టి హరీష్‌రావు ఇలా మాట్లాడడం సరికాదని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్ చేశారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈలోగా స్పీకర్ జోక్యం చేసుకుని ఇరుపక్షాలకు సర్ధిచెప్పేప్రయత్నం చేశారు. చివరకు సభ్యులు సైలెంట్ కావడంతో సభలో మళ్లీ రహదారుల అంశంపై చర్చ నడిచింది.
అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి కొందరు సభ్యులు అసెంబ్లీకి తాగి వస్తున్నారు హరీష్ రావు #BRS #HarishRao #TelanganaAssembly #HashtagU pic.twitter.com/rMfCH8lCOC
— Hashtag U (@HashtaguIn) December 18, 2024
Read Also : H 1B Visa Rules : భారతీయ టెక్ నిపుణులకు గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసా రూల్స్ సులభతరం