HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Harish Rao Stays Away From Kcr Meeting

KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం కావడంతో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం అప్రమత్తమైంది. కేవలం రాజకీయ వేదికలపైనే కాకుండా, న్యాయస్థానాల్లో కూడా సమర్థవంతంగా వాదనలు వినిపించాలని పార్టీ నిర్ణయించుకుంది. అందుకే హరీశ్ రావుకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది

  • Author : Sudheer Date : 20-04-2026 - 12:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao Pm
Harish Rao Pm

జగిత్యాలలో నేడు జరగనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు మాజీ మంత్రి హరీశ్ రావు దూరం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీకి ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్ రావు, కేసీఆర్ పాల్గొనే కీలక సభకు గైర్హాజరు కావడానికి గల కారణాలు ఏంటి అని అంత మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జగిత్యాలలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు ఆ పార్టీ కీలక నేత హరీశ్ రావు హాజరు కావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు ఇప్పుడు తారాస్థాయికి చేరడమే ఇందుకు ప్రధాన కారణం. కాళేశ్వరం ప్రాజెక్టుపై నమోదైన కేసులో హైకోర్టులో తుది విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపేందుకు మరియు న్యాయ సలహాలు పొందేందుకు ఆయన అత్యవసరంగా ఢిల్లీ పయనమయ్యారు. పార్టీ సభ కంటే న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడటమే ప్రస్తుతానికి ప్రాధాన్యత అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

రాజకీయ వర్గాల్లో చర్చ

కేసీఆర్ పాల్గొనే ఏ సభకైనా హరీశ్ రావు ముందుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తుంటారు. అయితే, జగిత్యాల వంటి కీలక ప్రాంతంలో సభ జరుగుతున్న సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశంపై దూకుడు పెంచిన తరుణంలో, హరీశ్ రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వెనుక లోతైన వ్యూహం ఉందని భావిస్తున్నారు. కేసీఆర్ సూచన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, సభలో నాయకులు లేకపోయినా క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగానే ఉందని శ్రేణులకు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు.

న్యాయ పోరాటంపై బీఆర్ఎస్ దృష్టి

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం కావడంతో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం అప్రమత్తమైంది. కేవలం రాజకీయ వేదికలపైనే కాకుండా, న్యాయస్థానాల్లో కూడా సమర్థవంతంగా వాదనలు వినిపించాలని పార్టీ నిర్ణయించుకుంది. అందుకే హరీశ్ రావుకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. జగిత్యాల సభలో కేసీఆర్ తన ప్రసంగం ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తారనే దానితో పాటు, హరీశ్ రావు గైర్హాజరును రాజకీయ ప్రత్యర్థులు ఏ విధంగా అస్త్రంగా మార్చుకుంటారో వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs Jagtial Meeting
  • BRS Political Strategy
  • Delhi Visit for Legal Advice
  • harish rao
  • Kaleshwaram Project Case
  • KCR Jagtial Public Meeting
  • Legal Consultations in Delhi

Related News

Harish Rao Kmm

Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమం కుంటుపడిందని, అభివృద్ధి కంటే అవినీతికే పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ప్రజలు ఇప్పటికే మార్పును కోరుకుంటున్నారని హరీష్ రావు తన ప్రసంగంలో స్పష్టం

    Latest News

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • Rajasthan : రేపు ప్రారంభం కాబోతున్న వేళ రూ.80,000 కోట్ల ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం

    • జపాన్‌లో భారీ భూకంపం!

    • మీరు చ‌క్కెర ఎక్కువ‌గా తింటున్నారా?

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    Trending News

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

      • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

      • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

      • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd