Harish Rao Hospitalised : హాస్పటల్ లో హరీష్ రావు..షాక్ లో కార్యకర్తలు
Harish Rao Hospitalised : ప్రస్తుతం హరీష్ రావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు
- By Sudheer Published Date - 06:50 AM, Tue - 17 June 25

తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆదివారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఆకస్మికంగా తీవ్ర జ్వరం రావడం తో సికింద్రాబాద్‌లోని బేగంపేట కిమ్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ (Harish Rao Hospitalised) చేశారు. తెలంగాణ భవన్ లో ఉన్న సమయంలోనే ఆయన అస్వస్థతకు లోనవ్వడంతో వైద్యుల సలహాతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Narendra Modi : సైప్రస్‌లో ప్రధాని మోదీకి అనూహ్య స్వాగతం.. మోదీ పాదాలకు నమస్కరించి
హరీష్ రావు ఆసుపత్రిలో చేరిన వార్త తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు సీనియర్ నాయకులు వెంటనే కిమ్స్ హాస్పటల్‌కి వెళ్లి హరీష్ రావును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆరోగ్య విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
Shocking : అమ్మాయిలు ఇలా తయారేంట్రా బాబు.. గుండెలకు గన్ గురిపెట్టి..!
ప్రస్తుతం హరీష్ రావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై స్పష్టమైన వివరాలను కిమ్స్ ఆసుపత్రి వైద్య బృందం త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. హరీష్ రావు త్వరగా కోలుకోవాలని బీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.