Harish Rao : దేశంలోనే అత్యంత సంస్కార హీనమైన సీఎం రేవంత్ అంటూ హరీష్ ఫైర్..
- By Sudheer Published Date - 03:29 PM, Sat - 3 February 24

శుక్రవారం ఇంద్రవెల్లి లో సీఎం రేవంత్ (CM Revanth)..కేసీఆర్ (KCR) ఫై చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మీడియా సమావేశాలు పెడుతూ రేవంత్ కామెంట్స్ ఫై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. దేశంలోనే అత్యంత సంస్కార హీనమైన సీఎం రేవంత్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా? అని ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధమేనని హరీశ్ రావు ఆరోపించారు. అసెంబ్లీలోనూ అబద్దాలే.. ఆదిలాబాద్ లోనూ అబద్దాలేనని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు నాలుగు మెడికల్ కాలేజీలు ఇచ్చింది బీఆర్ఎస్సే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు సున్నా అని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు తిట్ల పురాణం తప్ప చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయని హరీష్ అన్నారు. సీనియర్ సిటిజన్లకు ప్రకటించిన పెన్షన్ రూ.4000 కాదు కదా.. ఇప్పటి వరకూ ఇచ్చిన రూ.2000 పెన్షన్ కూడా ఇవ్వలేదని హరీశ్ రావు గుర్తు చేశారు. రోజూ కరంట్ ఆరు సార్లు పోతున్నదని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు అన్నీ ఇన్నీ కాదని, ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్ల మీదకు ఈడ్చారని ఆరోపించారు.
ఇక కేటీఆర్ మాట్లాడుతూ.. చిన్న పిల్లలు కూడా కాంగ్రెస్ పార్టీ హామీలను గుర్తు చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. హైదరాబాదీ ఓటర్లు తెలివిగా అభివ్రుద్ధికి ఓటేశారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య తేడా కేవలం 1.8 శాతమేనని గుర్తు చేశారు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటున్నాడని కేటీఆర్ ఆక్షేపించారు. తమకు నోరు ఉందని, వంద రోజుల వరకూ తామూ ఓపిక పడతామన్నారు.
Read Also : Yatra 2 Trailer: ‘నేను విన్నాను, నేనున్నాను’.. ఆకట్టుకుంటోన్న ‘యాత్ర 2’ ట్రైలర్