HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Harish Rao Fire On Cm Speech

Praja Palana sabha : రేవంత్ రెడ్డి నీ పాపం ఏనాటికి పోదు – హరీష్ రావు

Praja Palana sabha : కేసీఆర్.. కేసీఆర్ అంటూ కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి నీ పాపం పోదు. కేసీఆర్ వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు' అని, పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుంచి బూతులు తప్ప నీతులు రాలేదు.

  • Author : Sudheer Date : 19-11-2024 - 9:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Cmrevanth
Harish Cmrevanth

కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవ సభలో(Praja Palana Sabha ) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి , సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్.. కేసీఆర్ అంటూ కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి నీ పాపం పోదు. కేసీఆర్ వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు’ అని, పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుంచి బూతులు తప్ప నీతులు రాలేదు. కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని చేసింది ఏమీ లేక.. చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు వదిలిండు’ అని హరీశ్ రావు మండిపడ్డారు.

కేసీఆర్ (KCR) తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిని , మళ్లీ గడ్డమీద కేసీఆర్ మొక్కను మొలవనివ్వనని, రాహుల్​ గాంధీని చూసి కేసీఆర్​ బుద్ధి తెచ్చుకోవాలి. ఒక్కసారి ఓడిస్తే.. మళ్లీ ప్రజల మొహం చూడవా? అధికారం ఇస్తే దోచుకోవటం.. ఓడిస్తే ఫామ్​హౌజ్​లో దాచుకోవటం. ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు ప్రజల మధ్యకు రావటం లేదు. నిజంగా ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ల మధ్యకు వచ్చి ఎందుకు అడగటం లేదు. మూడుసార్లు అధికారం దక్కపోయినా.. రాహుల్​ గాంధీ ప్రజల మధ్యే ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం సూచనలు ఎందుకు చేయట్లేదు అంటూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా హరీష్ రావు స్పందిస్తూ రేవంత్ తీరు పై మండిపడ్డారు. పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుండి బూతులు తప్ప నీతులు రాలేదు. కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని చేసిందేమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు వదిలిండు. ఇక నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మరిచిపోరు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి.. నువ్వు కేసీఆర్.. కేసీఆర్ అంటూ కేసీఆర్ గారి నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు. కేసీఆర్ గారి వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు. తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చానని గప్పాలు కొడుతున్నవు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులను తొక్కినవు. షార్ట్ క‌ట్‌లో అధికారం చేజిక్కించుకొని ప్రజలను తొక్కుతున్నవు. నీ వదురుబోతు తనంతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. నీ దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నాం అని హరీష్ రావు అన్నారు.

Read Also : Cranberries : గుండె ఆరోగ్యం నుండి డయాబెటిస్ నియంత్రణ వరకు, ఈ ఎర్రటి పండు సహాయపడుతుంది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • harish rao
  • kcr
  • Praja palana sabha
  • Revanth speech

Related News

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd