HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Group 2 Exam In Omr System Tspsc Announcement

Group 2-OMR : గ్రూప్ 2 ఎగ్జామ్ ఆ పద్ధతిలోనే నిర్వహిస్తాం : టీఎస్‌పీఎస్సీ

Group 2-OMR : గ్రూప్-2 పరీక్షను ఆప్టికల్‌ మార్క్‌ రికగ్నైజేషన్‌ (ఓఎంఆర్‌) పద్ధతిలోనే నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది.

  • By Pasha Published Date - 09:04 AM, Sun - 16 July 23
  • daily-hunt
TGPSC NEW UPDATE

Group 2-OMR : గ్రూప్-2 పరీక్షను ఆప్టికల్‌ మార్క్‌ రికగ్నైజేషన్‌ (ఓఎంఆర్‌) పద్ధతిలోనే నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 29, 30 తేదీల్లో రెండు సెషన్లలో గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది. మొత్తం 600 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు(Group 2-OMR) ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున నాలుగు పేపర్లకు కలిపి 600 ప్రశ్నలకు 600 మార్కులు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్) లో 150 ప్రశ్నలు (150 మార్కులు), పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ)లో 150 ప్రశ్నలు (150 మార్కులు), పేపర్-3 (ఎకానమీ & డెవలప్‌మెంట్)లో 150 ప్రశ్నలు (150 మార్కులు),  పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతారణ)లో 150 ప్రశ్నలు (150 మార్కులు) ఉంటాయి.

Also read : X mark : వందే భారత్‌ ట్రైన్స్ చివరి బోగీలపై X గుర్తు ఎందుకు లేదు ?

ఆగస్టు 29, 30 తేదీల్లో సెలవులు..

గ్రూప్‌-2 పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు ఆగస్టు 29, 30 తేదీల్లో సెలవులు ఉంటాయి. 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా.. మొత్తం 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది చొప్పున పోటీ పడుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Also read : Virat Kohli: చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లీ.. 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 10వ ఆటగాడిగా రికార్డు..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • announcement
  • Group 2-OMR
  • Group-2 exam
  • jobs
  • OMR method
  • OMR system
  • Optical Mark Recognition
  • Telangana Public Service Commission
  • TSPSC

Related News

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd