HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Grand Bathukamma Celebrations At Delhi Telangana Bhavan

Bathukamma Celebrations In Delhi: ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పూల రూపంలో ప్రకృతిని, స్త్రీశక్తిని ఆరాధించే పండుగగా బతుకమ్మ పండుగకు తెలంగాణ సంస్కృతిలో గొప్ప స్థానముంది. అనాదిగా ప్రతి యేడు ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను వేడుకగా జరుపుకుంటున్నాం.

  • By Gopichand Published Date - 08:15 PM, Wed - 9 October 24
  • daily-hunt
Bathukamma Celebrations In Delhi
Bathukamma Celebrations In Delhi

Bathukamma Celebrations In Delhi: తెలంగాణ‌లో బతుక‌మ్మ సంబరాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations In Delhi) ఘనంగా జరిగాయి.ఈ బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుంచి గత పదేళ్ళుగా ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తుంది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ప్రసంగిస్త.. “బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక. పూల రూపంలో ప్రకృతిని, స్త్రీశక్తిని ఆరాధించే పండుగగా బతుకమ్మ పండుగకు తెలంగాణ సంస్కృతిలో గొప్ప స్థానముంది. అనాదిగా ప్రతి యేడు ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను వేడుకగా జరుపుకుంటున్నాం. ఈ తొమ్మిది రోజులపాటు తెలంగాణ పల్లెలు, పట్టణాలు పూలవనాన్ని తలపించేలా బతుకమ్మలతో కొత్త కళను సంతరించుకుంటాయి. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి బృహదమ్మ (పార్వతి) పేరు మీదుగా బతుకమ్మ అనే పేరు వాడుకలోకి వచ్చి, అదొక ఆచారంగా స్థిరపడిందనే విషయం మనకు తెలిసిందే. బతికించే అమ్మ అనే భక్తి భావంతో ఆ జగన్మాతకు నీరాజనాలు అర్పించటమే బతుకమ్మ పండుగలో ఇమిడి వున్న అంతరార్థం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. ఈ భూమితో, ఈ జలంతో, మానవ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒక సంబరంగా వేడుకలను జరుపుకోవడమే బతుకమ్మ పండుగ పరమార్థం.

Also Read: Ratan Tata: ర‌త‌న్ టాటా ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉంది..? విషమంగా ఉంద‌ని ప్ర‌చారం!

దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ స్థిరపడిన తెలంగాణ బిడ్డలు బతుకమ్మ పండుగను ఇప్పటికీ మరవకుండా జరుపుకోవడం బతుకమ్మ పండుగ ప్రత్యేకతను, బతుకమ్మ పట్ల తెలంగాణ ప్రజలకున్న అభిమానాన్ని చాటుతున్నది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను దేశమంతా చాటేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ యేడు తెలంగాణ భవన్ లో అట్టహాసంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నది. వీరోచిత పోరాటంతో నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛావాయువులు అందించిన కాంగ్రెస్ పార్టీ, అదే ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని మహోజ్వల రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నది. బతుకమ్మ పండుగ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సేవలో పునరంకితమవుతున్నది. భావితరాలకు బతుకమ్మను అందిద్దాం. తెలంగాణ వారసత్వ సంస్కృతిని కొనసాగిద్దాం” అని ఆయ‌న‌ అన్నారు.

ఈ బతుకమ్మ వేడుకలకు పలువురు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్ల‌ అధికారులు,ఇతర సిబ్బంది.. భారీగా హాజరైన బ‌తుక‌మ్మ‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నార‌ను.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bathukamma Celebrations
  • Bathukamma Celebrations In Delhi
  • cm revanth
  • dasara
  • Dasara Festival
  • delhi
  • Delhi news
  • telangana bhavan
  • telangana festival

Related News

Bathukamma

Bathukamma: ఈనెల 21 నుంచి బతుకమ్మ సంబరాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ?

ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధన, ఆడపడుచుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ తొమ్మిది రోజులు తెలంగాణ పల్లెలు, పట్టణాలు పండుగ శోభతో కళకళలాడతాయి.

  • Cm Revanth Kamareddy

    CM Revanth Kamareddy Tour : నిజమైన నాయకత్వానికి నిదర్శనం సీఎం రేవంత్ ..ఎందుకో తెలుసా..?

  • Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

    Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

  • Nirmalabhatti

    Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

  • Yamuna River Levels

    Yamuna River Levels: ఢిల్లీలో హై అల‌ర్ట్‌.. 207 మీటర్ల మార్కు దాటిన య‌మునా న‌ది నీటిమ‌ట్టం!

Latest News

  • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

  • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

  • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

Trending News

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd