Telangana Panchayat Elections : ఆగస్టు లో పంచాయతీ ఎన్నికలు – సీఎం రేవంత్ నిర్ణయం
త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి, ఆగస్టు నెల చివరి వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది
- By Sudheer Published Date - 06:34 PM, Fri - 26 July 24

తెలంగాణ లో పంచాయతీ ఎన్నికలు (Telangana Panchayat Elections) ఎప్పుడు జరుగుతాయా అని రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సర్పంచ్ ల పదవి కాలం పూర్తి అయ్యి నెలలు కావొస్తున్నా ఇంకా పంచాయతీ ఎన్నికలఫై క్లారిటీ లేదని మొన్నటివరకు అంత మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో మంత్రి పొంగులేటి (Minister Ponguleti Srinivas Reddy) బీసీ జనగణన అనంతరం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీంతో పంచాయతీ ఎన్నికలకు ఇంకాస్త సమయం పడుతుందని అంత భావించారు. కానీ వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ చేశారట.
We’re now on WhatsApp. Click to Join.
త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి, ఆగస్టు నెల చివరి వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఐదేండ్ల క్రితం ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ఈ రోజు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని, ఆగష్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీల పాలనను ప్రత్యేకాధికారులకు అప్పగించిది ప్రభుత్వం. ఈ నెల 4తో ఎంపీటీసీలు, జడ్పీటీసీల టర్మ్ ముగిసింది. మండల పరిషత్ ల బాధ్యతలను ఎంపీడీఓ పై ర్యాంక్ అధికారులకు, జిల్లా పరిషత్ ల బాధ్యతలను కలెక్టర్లు, అదరపు కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. మరి పంచాయితీ తాలూకా ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. పంచాయితీ ఎన్నికలంటే ఆ సందడి మాములుగా ఉండదు. అసెంబ్లీ , పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు ఒత్తైతే పంచాయితీ ఎన్నికలు తగ్గేదేలే అనిపిస్తాయి. ఇక్కడ వ్యక్తులను చూసి ఓట్లు వేస్తుంటారు. సో ఈ ఎన్నికలు చాల రంజుగా ఉండబోతాయి.
Read Also : Peddireddy Attack : చంద్రబాబుపై చేయిచేసుకున్న పెద్దిరెడ్డి ..?