Tamilisai : “ఎట్ హోం” కార్యక్రమానికి కేసీఆర్ డుమ్మా…స్పందించిన గవర్నర్..!!
రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టడంపై...గవర్నర్ తమిళిసై స్పందించారు.
- By hashtagu Published Date - 10:20 AM, Tue - 16 August 22

రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టడంపై…గవర్నర్ తమిళిసై స్పందించారు. ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తూ…తాను స్వయంగా లేఖ రాశానని చెప్పారు. అయినప్పటికీ కేసీఆర్ ఎందుకు రాలేదో తనకు తెలియదన్నారు. నిజానికి సోమవారం సాయంత్రం 6:55 గంటలకు కార్యక్రమానికి హాజరవుతున్నట్లు CMO కార్యాలయం తెలిపిందన్నారు. సీఎం రాకపోవడంపై తమకు ఎలాంటి సమాచారం లేదని…ఆయన కోసం తాను, హైకోర్టు చీఫ్ జస్టిస్ అరగంటపాటు ఎదురుచూశామని గవర్నర్ తెలిపారు. అయినప్పటికీ రాకపోవడం,అతిథులందరూ ఎదురుచూస్తుండటంతో కార్యక్రమానికి ప్రారంభించాల్సి వచ్చిందన్నారు. సాయంత్రం 6 గంటలకు తమిళిసై పుదుచ్చేరి నుంచి రాజ్ భవన్ కు చేరుకోగా…అప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భయాన్ దంపతులు సహా గెస్టులందరూ అప్పటికే చేరుకున్నారని గవర్నర్ తెలిపారు.