Governor Tamilisai : తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసిన గవర్నర్
గవర్నర్ ఆమోదంతో ఎలక్షన్ కమిషన్ కొత్త అసెంబ్లీకి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది
- Author : Sudheer
Date : 04-12-2023 - 7:17 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో మూడో శాసనసభ (Formation Of Third Assembly) ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ (Notification ) విడుదలైంది. ఈ మేరకు గెజిట్‌ను గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) సౌందరరాజన్‌కు ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అందించారు. గవర్నర్ తమిళిసైకి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నివేదికతో పాటు, గెలిచిన అభ్యర్థులు జాబితాను అందించారు. అనంతరం శాసనసభను రద్దు చేశారు గవర్నర్ తమిళిసై. గవర్నర్ ఆమోదంతో ఎలక్షన్ కమిషన్ కొత్త అసెంబ్లీకి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మరోపక్క పాత శాసనసభ రద్దై కొత్త శాసనసభ కొలువు తీరనుంది. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎంతోపాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఇదివరకే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించగా, తమిళిసై ఆమోదించారు. మరికొన్ని గంటల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సీఎం ఎవరన్నది కాంగ్రెస్ కేంద్ర అధిష్టానం ప్రకటించనుంది. దాంతో సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాదించిన సంగతి తెలిసిందే. 64 స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కు 39 సీట్లు వచ్చాయి. బీజేపీ 8, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 60 స్థానాలుండాలి. కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ రావడంతో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ కాంగ్రెస్ ను ఆహ్వానించారు.
Read Also : Telangana CM : తెలంగాణ కొత్త సీఎం ప్రకటన ఈరోజు లేనట్లే..