Governor Tamilisai : రాజీనామా వార్తలపై గవర్నర్ తమిళిసై క్లారిటీ
- By Sudheer Published Date - 03:17 PM, Sat - 30 December 23

గత మూడు రోజులుగా గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) కి సంబదించిన ఓ వార్త సోషల్ మీడియా లో , మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తమిళిసై ..తన గవర్నర్ పదవికి రాజీనామా (Resign ) చేసి లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికల్లో పోటీ చేయబోతుందనే వార్తలు చక్కర్లు కొట్టడం తో అంత నిజమే కావొచ్చని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ వార్తలపై తమిళసై క్లారిటీ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
గవర్నర్‌గా తాను సంతోషంగానే ఉన్నానని, రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు అని స్పష్టం చేశారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయవద్దని కోరారు. ఏదైనా నిర్ణయం ఉంటే తానే తెలియజేస్తానని అన్నారు. తూత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రధాని మోదీ, రాముడి దయతో గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్నానని అన్నారు. తాను ఢిల్లీ వెళ్లలేదని.. ఎవరినీ రిక్వెస్ట్ చేయలేదని తెలిపారు. తూత్తుకుడి వరదల వల్ల ప్రభావితం అయ్యినందున అక్కడి వెళ్లి చూసివచ్చా తప్ప.. ఎన్నికల్లో పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు. తాను ఇక్కడే ఉంటానని.. ప్రజలతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతానని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
Read Also : RGV vs Nagababu : అదేంటి వర్మ.. మీరు ఇంకా బ్రతికే ఉన్నారా..? – నాగబాబు మెగా కౌంటర్