News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Telangana News
  • ⁄Google Telangana Govt Sign Mou To Harness Tech For Economic And Social Development

Google : గూగుల్ తో యువత, మహిళలు, విద్యార్థుల తలరాత మార్చే సంకల్పం!!

రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం , గూగుల్ తో అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీంతో గూగుల్ కెరీర్ సర్టిఫికెట్ స్కాలర్ షిప్ లు రాష్ట్ర యువతకు అందేందుకు మార్గం సుగమం అయింది.

  • By Hashtag U Published Date - 06:00 PM, Thu - 28 April 22
Google : గూగుల్ తో  యువత, మహిళలు, విద్యార్థుల తలరాత మార్చే సంకల్పం!!

రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం , గూగుల్ తో అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీంతో గూగుల్ కెరీర్ సర్టిఫికెట్ స్కాలర్ షిప్ లు రాష్ట్ర యువతకు అందేందుకు మార్గం సుగమం అయింది. తెలంగాణలోని మహిళా వ్యాపారవేత్తలకు డిజిటల్, బిజినెస్, ఫైనాన్షియల్ నైపుణ్యాలపై శిక్షణ అందించే విషయంలోనూ గూగుల్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయనున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు అవసరమైన డిజిటల్ బోధన, అభ్యసన ఉపకరణాలను గూగుల్ సమకూర్చనుంది. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు, వ్యవసాయ రంగంలో డిజిటల్ పరిజ్ఞానం వినియోగాన్ని పెంచేందుకు కూడా గూగుల్ తోడ్పాటును అందించనుంది. అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న ప్రధాన కార్యాలయం తర్వాత గూగుల్ 3.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన రెండో అతిపెద్ద క్యాంపస్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల‌ మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ .. గూగుల్ తో తెలంగాణ సర్కారు కుదుర్చుకున్న ఎంవోయూ గురించి వెల్లడించారు. గూగుల్ 2017 నుంచే తెలంగాణ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేస్తోంద‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా పాల్గొన్నారు. కాగా, గచ్చి బౌలిలో 2019 సంవత్సరంలో గూగుల్ 7.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ స్థలంలో 23 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తోంది. ఇందులో 3.30 మిలియన్ చదరపు అడుగుల వర్క్ స్పేస్ అందుబాటులోకి వచ్చేలా.. భవనాన్ని గూగుల్ డిజైన్ చేసింది.

Tags  

  • google
  • It minister ktr
  • telangana

Related News

High Court: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్

High Court: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేరును సుప్రీంకోర్టు మంగళవారం సిఫార్సు చేసింది.

  • Beer Sales: బీరు జోరు.. రికార్డుస్థాయిలో సేల్స్!

    Beer Sales: బీరు జోరు.. రికార్డుస్థాయిలో సేల్స్!

  • Speedy Justice: న్యాయం.. సత్వరం!

    Speedy Justice: న్యాయం.. సత్వరం!

  • Revanth Reddy Demands: అమిత్ షాపై రేవంత్ ‘అస్త్రాలు’

    Revanth Reddy Demands: అమిత్ షాపై రేవంత్ ‘అస్త్రాలు’

  • MLC Kavitha: అమిత్ షాపై కవిత ప్రశ్నల వర్షం!

    MLC Kavitha: అమిత్ షాపై కవిత ప్రశ్నల వర్షం!

Latest News

  • Virus In SmartPhone: మీ స్మార్ట్ ఫోన్‌కు వైరస్ సోకకుండా ఇలా జాగ్రత్త పడండి…లేకపోతే హ్యాకర్ల చేతిలో మీ పని గోవిందా…?

  • P Chidambaram : సీబీఐ త‌నిఖీల‌పై చిదంబ‌రం సంచ‌ల‌న ట్వీట్‌

  • AP CM Jagan : ప‌వ‌న్ దెబ్బ‌కు దిగొచ్చిన జ‌గ‌న్

  • Success Story: నేను కాదు.. అమ్మనే విజేత!

  • RCB Hall Of Fame: RCB హాల్ ఆఫ్ ఫేమ్ లో గేల్, ఏబీడీ

Trending

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Menstual Leave: ఇకపై ఆ దేశంలో మహిళలకు నెలకు మూడు రోజుల పీరియడ్ లీవ్…

    • Bajrang Dal Weapons: కర్నాటకలో మరో వివాదం…ఎయిర్ గన్స్ తో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రైనింగ్..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: