Water Crisis in Hyderabad : హైదరాబాద్ నగరవాసుల నీటి కష్టాలు తీరబోతున్నాయి ..
ప్రభుత్వం ముందస్తుజాగ్రత్తలు స్టార్ట్ చేసింది. హైదరాబాద్ కు నాగార్జున సాగర్ నుండి రోజుకు 270 మిలియన్ గ్యాలన్స్ ఫర్ డే సరఫరా చేస్తున్నారు
- By Sudheer Published Date - 04:51 PM, Sun - 21 April 24

గత సంవత్సరం తక్కువ వర్షాపాతం నమోదవటం, భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతుండటంతో.. హైదరాబాద్ (Hyderabad) లో నీటి కష్టాలు (Water Crisis) తీవ్రమయ్యాయి. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. గత వానాకాలం వర్షాలు సరిగా కురవకపోవడంతో కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులు అడుగంటాయి. ఫలితంగా హైదరాబాద్కు మంచినీటి కష్టాలు మొదలయ్యాయి.గతేడాది వర్షాలు సరిపడనంతా పడలేదని.. ప్రాజెక్టుల్లో కూడా నీళ్లు లేవని.. అందుకే రైతులకు సాగునీరు ఇవ్వలేకపోతున్నామని, భూగర్భనీటి స్థాయిలు కూడా తగ్గిపోతున్నాయని నీటి కష్టాలు తప్పవని.. ప్రభుత్వ పెద్దలు డైరెక్టుగానే చెప్పకనే చెప్పేస్తున్నారు. రాష్ట్రమంతా ఎలా ఉన్నా.. సాధారణంగానే వేసవిలో హైదరాబాద్‌లో నీటి ఎద్దడి ఉంటుంది. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితిలో ముందుముందు ఎలాంటి సంక్షోభం ఏర్పడనుందోనని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ముందస్తుజాగ్రత్తలు స్టార్ట్ చేసింది. హైదరాబాద్ కు నాగార్జున సాగర్ నుండి రోజుకు 270 మిలియన్ గ్యాలన్స్ ఫర్ డే సరఫరా చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నీటిని ముందుగా.. అక్కంపల్లి రిజర్వాయర్ కు తరలిస్తారు.. అక్కడి నుంచి కొదండాపూర్ నీటి శుద్ధి కేంద్రానికి తరలిస్తారు. అక్కడి నుంచి సిటీకి వాటరు వస్తాయి. నాగార్జునసాగర్ నీటి మట్టం తగ్గడంతో అధికారులు నీరు ఉన్న చోట పంపింగ్ చేయాలని నిర్ణయించారు. పుట్టంగండి వద్ద పంపింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా మంజీరా, సింగూరు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి కూడా హైదరాబాద్ కు నీరు వస్తోంది. అంత కలిపి రోజుకు 500 మిలియన్ గ్యాలన్స్ ఫర్ డే సరఫరా అవుతోంది. ఇందులో నాగార్జునసాగర్ నుంచి అధిక మొత్తంలో సిటీకి నీరు సరఫరా అవుతోంది. ఈ నీటితో ప్రస్తుతానికి హైదరాబాద్ అవసరానికి నీరు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇక వర్షాకాలం స్టార్ట్ అయితే నీటికి ఇబ్బంది ఉండదని చెపుతున్నారు.
Read Also ; Rahul Gandhi : రాహుల్ గాంధీకి అస్వస్థత.. ‘ఇండియా’ ర్యాలీకి గైర్హాజరు