TS : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్…త్వరలో ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!!
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఖాళీను భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
- By hashtagu Published Date - 06:42 AM, Sun - 2 October 22

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఖాళీను భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. TSPSC ద్వారా ఈ నియామకాలను చేపడుతున్నట్లు చెప్పారాయన. ఐపీఏం ఫుడ్ సేఫ్టీ విభాగం ల్యాబ్స్ పనితీరు సాధించిన పురుగతిపై హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దన్నారు. ఆహార భద్రతా విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవలన్నారు.
కాగా ఖాళీగా ఉన్న పోస్టుల్లో TSPSCద్వారా త్వరలోనే భర్తీలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. కల్తీ ఆహారం పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. కల్తీని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎక్కడైనా ఆహారం నాణ్యత లేనట్లు సమాచారం ఉంటే 040 21111111 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. ఇంకా @AFCGHMC ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.