Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. గురుకులాల్లో 9వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
తెలంగాణలోని (Telangana) నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. గురుకులాల్లో 9వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తున్నట్లు విద్యాసంస్థలనియామక బోర్డు ప్రటించింది.
- By hashtagu Published Date - 10:29 AM, Thu - 6 April 23

తెలంగాణలోని (Telangana) నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. గురుకులాల్లో 9వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తున్నట్లు విద్యాసంస్థలనియామక బోర్డు ప్రటించింది. మొత్తం 9 నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది. 9వేలకు పైగా పోస్టుల్లో అత్యధికంగా 4020 టీజీటీ పోస్టులు ఉండటం గమనార్హం.
నోటిఫికేషన్ల వారీగా వివిధ కేటగిరిల్లో ఖాళీలను పరిశీలిస్తే
– డిగ్రీ కాలేజ్‌ల్లో లెక్చరర్,
– ఫిజికల్ డైరెక్టర్,
– లైబ్రేరియన్ల పోస్టులు 868,
-జూనియర్ కాలేజ్‌ల్లో లెక్చరర్,
– ఫిజికల్ డైరెక్టర్,
-లైబ్రేరియన్ పోస్టులు-2008,
-పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్-1276,
-స్కూల్స్‌లో లైబ్రేరియన్ పోస్టులు-434,
-స్కూల్స్‌లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు- 275,
– డ్రాయింగ్ టీచర్స్/ఆర్ట్ టీచర్స్ పోస్టులు-134,
-క్రాప్ట్ ఇన్‌స్ట్రక్టర్స్/ క్రాఫ్ట్ టీచర్స్-92,
-మ్యూజిక్ టీచర్స్-124,
– టీజీటీ పోస్టులు-4,020
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు పూర్తి సమాచారం https://treirb.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవచ్చు.