Another Big shock for BRS..? : BRSకు మరో బిగ్ షాక్..?
- Author : Sudheer
Date : 13-02-2024 - 11:38 IST
Published By : Hashtagu Telugu Desk
బిఆర్ఎస్ పార్టీ (BRS) కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున పార్టీ నుండి నేతలు బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరగా..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలోను అలాగే వలసల పర్వం కొనసాగుతుంది. రీసెంట్ గా పలువురు మాజీ ఎమ్మెల్యేలు , మంత్రులు , ఎమ్మెల్సీ లు బిఆర్ఎస్ కు రాజీనామా చేసి, కాంగ్రెస్ కండువా కప్పుకోగా..తాజాగా హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి (GHMC Deputy Mayor Srilatha Shoban Reddy) CM రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలవడం హాట్ టాపిక్ గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవల మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. అనంతరం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ CMను కలవడంతో ఆయన కూడా హస్తం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఈరోజు మంగళవారం డిప్యూటీ మేయర్..సీఎం రేవంత్ ను కలవడం బిఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఆమె సికింద్రాబాద్ కాంగ్రెస్ MP టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానం కోసం ఇప్పటికే పల్వుయూరు ఖర్చీఫ్ వేసుకొని ఉన్నారు..మరి ఈ టికెట్ ఫైనల్ గా ఎవరికీ వస్తుందో చూడాలి.
శ్రీలత రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ (టీటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి భార్య. ఆమె 2002లో తార్నాక డివిజన్ నుంచి బిఆర్ఎస్ పార్టీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయింది. శ్రీలత రెడ్డి టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె, వంటావార్పు, మిలియన్ మార్చి, రైల్‌రోకో, చలోడిల్లీ వంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది. 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తార్నాక డివిజన్ నుంచి BRS పార్టీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచి 2021 ఫిబ్రవరి 11న గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టింది. గత కొద్దీ రోజులుగా ఈమె బిఆర్ఎస్ ఫై అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తి మూలంగా ఇప్పుడు ఆమె ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
Read Also ; AIMIM: బీహార్‌లో ఎంఐఎం నేత అబ్దుల్ సలామ్ కాల్చివేత