Free bus for women: ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం ద్వారా వెలవెలబోతున్న మెట్రో
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ద్వారా ఒక్క ఆటో ప్రయాణానికే కాకుండా మెట్రో రైలుపైనా కూడా ఆ ప్రభావం పడుతుంది. ఉచిత ప్రయాణ సౌకర్యం కారణంగా మహిళలు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు
- Author : Praveen Aluthuru
Date : 16-12-2023 - 8:09 IST
Published By : Hashtagu Telugu Desk
Free Bus For Women: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ద్వారా ఒక్క ఆటో ప్రయాణానికే కాకుండా మెట్రో రైలుపైనా కూడా ఆ ప్రభావం పడుతుంది. ఉచిత ప్రయాణ సౌకర్యం కారణంగా మహిళలు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో మెట్రో రైళ్లలో ప్రయాణించే మహిళల సంఖ్య తగ్గింది. దీంతో మెట్రో రైళ్లలో సీట్లు సులువుగా లభిస్తున్నాయి. కొంతమంది మహిళలు మాత్రమే మెట్రో రైలును ఉపయోగిస్తున్నారు.
ఆఫీసులు దగ్గరలో ఉన్నప్పుడు మెట్రోలో ప్రయాణించే వారు కూడా ఇప్పుడు బస్సు ఎక్కేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఉచిత ప్రయాణ ప్రభావం మెట్రోపై కూడా పడింది. కొందరు మహిళలు ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు.. మెట్రో స్టేషన్ నుంచి ఆఫీసుకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
ప్రధాన మార్గాల్లో వెళ్లే బస్సులన్నీ మహిళా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టినప్పటి నుంచి సీట్లు దొరకడం కష్టమవుతుంది. రద్దీ లేని సమయాల్లో మెట్రో రైళ్లలో మహిళల రద్దీ గణనీయంగా తగ్గింది. గతంలో కంటే మెట్రోలో రద్దీ తగ్గిందని, సీట్లు అందుబాటులో ఉన్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
Also Read: Telangana Assembly Session 2023: సీఎం రేవంత్ అబద్ధాలకోరు : ఎమ్మెల్యే హరీష్