CM Revanth Reddy : రేవంత్ మాట్లాడుతున్న తీరు ఫై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం
- Author : Sudheer
Date : 12-03-2024 - 11:38 IST
Published By : Hashtagu Telugu Desk
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తాను మానవ బాంబు అవుతానని మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు మాజీ సీఎం కేసీఆర్ (KCR). ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వహించింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ మాట్లాడుతున్న భాష ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.
‘సీఎంని ఆరు గ్యారంటీలు, కరెంటు మాయమైంది.. నీళ్లెందుకు మాయమైతున్నయ్ అంటే.. ఆయన నేను పండవెట్టి తొక్కుత.. పేగులు మెడల వేసుకుంట.. పెండ మోకానికి రాసుకుంట.. చీరుత.. సంపుత.. మానవ బాంబునైత.. మట్టిబాంబునైత అని మాట్లాడుతున్నడు. ఇంత అసహనమా..? సీఎం మాట్లాడాల్సిన భాషనా? పద్ధతా? తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి ఇదో గౌరవమా? అని కేసీఆర్ ప్రశ్నించారు. దీనిని దయచేసి ప్రజలు ఆలోచించాలి..గమనించాలని కోరారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మానవబాంబు అయితమని మాట్లాడవచ్చునా ? మాకు మాట్లాడరాదా? తిట్టాలంటే తిట్లు తక్కువ ఉన్నయా? ఈరోజు గియాళకు మొదలుపెడితే రేపు గియాళ వరకు మాట్లాడొచ్చు. నేను మాట్లాడినా.. ఉద్యమంలో మాట్లాడాను. తెలంగాణను వ్యతిరేకించినోళ్లను దద్దమ్మలు, సన్నాసులు అన్నాను. సమైక్యవాదం.. సమగ్ర అభివృద్ధి అంటే.. సన్నాసున్నాలారా ఏదిరా అని మాట్లాడిన.
We’re now on WhatsApp. Click to Join.
నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదేళ్లలో ఒక్కరోజు, సందర్భంలో దురుసుమాటలు విన్నరా? నేను చెప్పే మాటలపై ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం’ అని రేవంత్ భాష ఫై నిప్పులు చెరిగారు. ‘‘కొన్ని సందర్భాల్లో అత్యాశకో, దురాశకో పోయి ప్రజలు మోసపోతరు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇప్పుడు 100 రోజుల్లోనే కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చూస్తున్నరు. ఆరు చందమామలు, ఏడు సూర్యులు పెడతం అని మాట్లాడిన్రు. ఇవాళ నోటికి మొక్కాలే. 400 హామీలిచ్చిన్రు. ఇప్పుడు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతం అని ఓ మంత్రి అంటడు. బిడ్డా.. రైతుల చెప్పులు చానా బందోబస్తు ఉంటయ్.. అంటూ కేసీఆర్ హెచ్చరించారు.
Read Also : KTR: గులాబీ సభ సక్సెస్.. కాంగ్రెస్, బీజేపిల గుండెల్లో గుబులు : కేటీఆర్