Telangana Election : పోస్టల్ బ్యాలెట్ ఓటు వెయ్యాలి అనుకునేవారు ఈరోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు
రాష్ట్రంలో ఫస్ట్ టైం వికలాంగులు, 80 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కేంద్రం ఎన్నికల సంఘం కల్పించింది
- Author : Sudheer
Date : 04-11-2023 - 10:38 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. నిన్నటి నుండి అభ్యర్థుల నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. మొదటి రోజు దాదాపు 94 మంది నామినేషన్ వేశారు. అధికార పార్టీ , ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం ఇప్పటీకే నామినేష్లకు సంబదించిన ముహుర్తాలు చేసుకొని , సిద్ధం అవుతున్నారు.
ఇదిలా ఉంటె పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot Vote) ద్వారా ఓటు వెయ్యాలి అనుకునేవారు ఈరోజు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఫస్ట్ టైం వికలాంగులు, 80 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కేంద్రం ఎన్నికల సంఘం కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన వారు ఈ నెల 7వ తేదీలోగా బూత్ లెవల్ అధికారి (BLO)కి ’12డీ’ ఫారం (Form 12D) ద్వారా దరఖాస్తు (Application ) చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం లభిస్తుంది . ఇలా అప్లై చేసుకున్న వారి ఇంటికి.. ఎన్నికల రోజున ఎన్నికల సిబ్బంది వస్తారు. వారి దగ్గర ఓ బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. అందులో ఓటు వెయ్యవచ్చు. ఎవరికి ఓటు వేసిందీ.. వేసేవారికి తప్ప ఎవ్వరికీ తెలియదు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే అత్యవసర సేవలు అందిస్తున్న 13 శాఖల సిబ్బంది, ఉద్యోగులు, అధికారులకు కూడా పోస్టల్ ఓటింగ్ సౌకర్యం కల్పించారు. వీరు కూడా ఆయా శాఖల నోడల్ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీరితో పాటు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. ఐతే.. వీరంతా కూడా ఎన్నికల రోజునే ఓటు వెయ్యాల్సి ఉంటుంది. ముందుగా వేసే అవకాశం ఉండదు. ఈసారి 13 లక్షల మందికి పైగా పోస్టల్ ఓటు హక్కును వాడుకుంటూ ఇంటి దగ్గరే ఓటు వేసేందుకు అర్హులుగా ఉన్నారు. మరి వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా.. లేక.. ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రానికే వెళ్లి ఓటు వేస్తారా అన్నది చూడాలి.
Read Also : UP : దళిత మహిళను అత్యాచారం చేసి..తర్వాత ముక్కలు ముక్కలుగా నరికేశారు