Forgotten Teachers : ప్రైవేటు గురువులపై కేసీఆర్ గుస్సా
జీవితాలను కోవిడ్ ఛిన్నాభిన్నం చేసింది. దాని తాకిడికి తల్లకిందులైన ప్రైవేటు టీచర్ల భవిష్యత్ ఇప్పటికీ అగమ్యగోచరం. ఛిద్రమైన వాళ్ల జీవితాలను అధ్యయనం చేసిన హక్కు అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫాం స్పందించింది.
- By Balu J Published Date - 12:12 AM, Fri - 5 November 21

జీవితాలను కోవిడ్ ఛిన్నాభిన్నం చేసింది. దాని తాకిడికి తల్లకిందులైన ప్రైవేటు టీచర్ల భవిష్యత్ ఇప్పటికీ అగమ్యగోచరం. ఛిద్రమైన వాళ్ల జీవితాలను అధ్యయనం చేసిన హక్కు అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫాం స్పందించింది. తెలంగాణ టీటర్ల జీవితాల గురించి ప్రభుత్వానికి తెలియచేసింది. రాష్ట్రంలోని 30 ప్రైవేటు పాఠశాలలకు చెందిన టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం సుమారుగా ఒక లక్ష వరకు ప్రైవేటు స్కూల్స్ తెలంగాణాలో ఉన్నాయి. వాటిలో పనిచేసే టీచర్లది ఒక్కొక్కళ్లది ఒక్కో విధమైన బాధకరమైన స్టోరీ. టీచింగ్ ఫ్యాషన్ గా జ్యోతి భావించింది. ఆ మేరకు బోధనా రంగంలో గత 17ఏళ్లుగా పనిచేస్తోంది. కోవిడ్ తరువాత ఉద్యోగం పోయింది. దినసరి అవసరాలు తీర్చుకోలని దుస్థితి పట్టింది. బంగారం ఆభరణాలను తాకట్టుపెట్టి చిన్న వ్యాపారం ప్రారంభించింది. రెండో విడత కోవిడ్ దెబ్బకు ఆ బిజినెస్ నష్టం వచ్చింది. ఏమీ చేయలేని నిస్సాహాయ స్థితిలో జ్యోతి ఉంది.
హైద్రాబాద్ కు చెందిన మల్లేశం తెలుగు టీచర్ గా, పీఈటీ ప్రాక్టీషనర్ గా ప్రైవేటు స్కూల్ లో పనిచేసేవాడు. రెండేళ్ల క్రితం కోవిడ్ కారణంగా ఉద్యోగం పోయింది. నగరంలో అద్దెలు చెల్లించలేక వికారాబాద్ జిల్లాలోని సొంత గ్రామం వెళ్లాడు. ప్రస్తుతం అక్కడ వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. స్కూల్స్ ప్రారంభించినప్పటికి పరిమిత సంఖ్యలో టీచర్స్ పనిచేస్తున్నారు. దీంతో మల్లేశంకు ఎలాంటి అవకాశం రాలేదు.
సారంగపాణి..ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. విద్యార్థులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు తర్ఫీదు ఇస్తుంటాడు. కోవిడ్ దెబ్బకు గత రెండేళ్లుగా ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కొనసాగింది. ప్రస్తుతం కూడా ఆన్ లైన్ వైపు ఎక్కువ మంది విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ అవసరం లేకుండా పోయింది. దీంతో సారంగపాణి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. పైడికుమార్ హిందీ భాషా బోధకుడు. ప్రైవేటు స్కూల్స్ కు వెళ్లి హిందీ చెప్పాడేవాడు. టీచర్స్ కూడా కొందరు ట్రైనింగ్ కోసం ఆయనను ఆశ్రయించే వాళ్లు. కోవిడ్ తరువాత చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోయారు. స్కూల్స్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో పైడికుమార్ అవసరం ఎవరికీ లేకుండా పోయింది.
Forgotten Teachers of #Hyderabad — A #HakkuCampaign
Watch Series on #HakkuChannel at: https://t.co/lC4HYkLW7E
Send info on Forgotten Teachers at 7842611055 / @HakkuInitiative pic.twitter.com/TPkjWX5FT3
— Kota Neelima కోట నీలిమ (@KotaNeelima) October 1, 2021
కోవిడ్ తొలి రోజుల్లో ఎవరో ఒకరు టీచర్స్ ఆయనకు సహాయం చేసే వాళ్లు. ఇప్పుడ అందరూ రోడ్డు పడడంతో సహాయం కోసం కుమార్ ఎదురుచూస్తున్నాడు. ..ఇలా అనేక మంది ప్రైవేటు టీచర్ల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. ఆ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ సానుకూల స్పందన మాత్రం లేదు. కోవిడ్ సమయంలో ప్రైవేటు టీచర్లను ఆదుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలు వాస్తవరూపం దాల్చలేదు. రేషన్ కొన్నిరోజులు ఇచ్చారు. ఆ తరువాత రేషన్ కూడా ప్రైవేటు టీచర్లకు ఇవ్వడంలేదు. ఇస్తామన్న సహాయం కూడా ఇవ్వలేదు. ఫలితంగా కూలీలుగా మారిన ప్రైవేటు టీచర్ల కోసం హక్కు స్వచ్చంధ సంస్థ వివిధ సోషల్ మీడియా వేదికలపై ఫోకస్ చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిద్దాం.
(Compiled by Pramod Kolikipudi, Hakku Initiative/Hakku Channel)
Related News

Covid In Pregnancy : కోవిడ్ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే కడుపులో బిడ్డకు ప్రమాదమా..? నిపుణులు ఏం చెబుతున్నారు..
దేశంలో కరోనా (COVID-19) మరోసారి విజృంభిస్తోంది. తాజాగా ఓ పరిశోధనలో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నిజానికి, గర్భధారణ సమయంలో SARS-CoV-2 ఇన్ఫెక్షన్ ఉన్న తల్లులకు జన్మించిన పిల్లలు డెలివరీ తర్వాత మొదటి 12 నెలల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వంటి న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్‌లతో బాధపడుతున్నారు.