Fire on Auto : మద్యం మత్తులో ప్రజా భవన్ ఎదుట ఆటోకు నిప్పు..
- Author : Sudheer
Date : 01-02-2024 - 8:50 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్లోని ప్రజా భవన్ (Praja Bhavan) ఎదుట ఓ ఆటో డ్రైవర్ (Auto Driver) తన ఆటోకు నిప్పంటించారు. తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..మహిళల కోసం ఫ్రీ బస్సు సౌకర్యం (Free Bus) కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చిన దగ్గరి నుండి ఆటోలకు గిరాకీ తగ్గింది. ప్రతి ఒక్కరు వెయిట్ చేసి మరి బస్సు ఎక్కుతుండడం తో ఆటోలు ఎక్కేవారు తగ్గిపోయారు. దీంతో తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని, కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని వారంతా వాపోతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు , ధర్నాలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఆటో డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పొట్టకూటికోసం సొంత ఊర్లను వదిలి..హైదరాబాద్ లో ఉంటున్న వారంతా ఇప్పుడు మా బ్రతుకులు రోడ్డున పడ్డాయని బాధపడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో గురువారం ఓ ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ప్రజాభవన్ వద్ద తన ఆటోకు నిప్పంటించాడు. ఆటో డ్రైవర్‌ను మహబూబ్ నగర్‌కు చెందిన దేవా(45)గా పోలీసులు గుర్తించారు. ఆటో కిరాయిలు దొరకడం లేదని ఆటోడ్రైవర్ మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. కిరాయిలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సదరు వ్యక్తి వెల్లడించాడు. అయితే వెంటనే తేరుకున్న ప్రజా భవన్ సిబ్బంది, పోలీసులు ఆటోలో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. డ్రైవర్ దేవాను అదుపులోకి తీసుకున్నారు.
Read Also : Coconut Milk: పొడవాటి జుట్టు కోసం ట్రై చేస్తున్నారా.. అయితే కొబ్బరి పాలతో ఇలా చేయండి?