Fine Rice Price : తెలంగాణలో దిగివస్తున్న సన్న బియ్యం ధరలు
Fine Rice Price : గతంతో పోల్చితే సన్న బియ్యం ధర రూ.60 నుంచి రూ.70 వరకు ఉండేది. కానీ ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో రూ.50 నుంచి రూ.55 వరకు లభిస్తోంది
- Author : Sudheer
Date : 26-03-2025 - 4:44 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సన్న బియ్యం (Fine Rice) కు భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వాటి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ ప్రోత్సాహకాలు. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వడమే. దీంతో రైతులు సన్న బియ్యం ఉత్పత్తిని అధికంగా పెంచారు. ఈ అధిక ఉత్పత్తి కారణంగా మార్కెట్లో సన్న బియ్యం సరఫరా పెరిగి, ధరలు తగ్గడం ప్రారంభమైంది.
Break Fast: బరువు తగ్గాలంటే ఉదయం ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తినాలో మీకు తెలుసా?
గతంతో పోల్చితే సన్న బియ్యం ధర రూ.60 నుంచి రూ.70 వరకు ఉండేది. కానీ ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో రూ.50 నుంచి రూ.55 వరకు లభిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్రంలో సన్న బియ్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటంతో ఆర్‌ఎన్‌ఆర్, హెచ్‌ఎంటీ రకాల బియ్యాల ధరలు కూడా తగ్గాయి. మిల్లుల్లో వీటి హోల్‌సేల్ ధర కిలో రూ.45 కు అమ్ముతున్నారు. రిటైల్ మార్కెట్లో ధరలు క్రమంగా తగ్గుతాయని వ్యాపారవేత్తలు చెబుతున్నారు.
SLBC : పూర్తి చేసి తీరుతాం – మంత్రి ఉత్తమ్ క్లారిటీ
ఉగాది తర్వాత రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకు బియ్యం అందుబాటులోకి వస్తుంది. ఈ చర్యతో మరికొంత కాలంలో బియ్యం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలు ఇప్పటికే ప్రభుత్వ పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారు. సన్న బియ్యం సరఫరా పెరుగుతుండటంతో, ఇది తెలంగాణ ప్రజలకు ఆర్థికంగా ఉపశమనం కలిగించే అంశం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.