Break Fast: బరువు తగ్గాలంటే ఉదయం ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తినాలో మీకు తెలుసా?
ఉదయం సమయంలో ఇప్పుడు చెప్పే బ్రేక్ ఫాస్ట్ తింటే తప్పకుండా ఈజీగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. అయితే ఈజీగా బరువు తగ్గాలి అంటే ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలిప్ ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 04:33 PM, Wed - 26 March 25

మామూలుగా బరువు తగ్గాలి అనుకున్నవారు ఎక్సర్సైజులు, జిమ్ కి వెళ్లడం, వ్యాయమాలు చేయడం మాత్రమే కాదు. అందుకు తగ్గట్టుగా డైట్ కూడా ఫాలో అవ్వాలి. అప్పుడే ఈజీగా ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలి అనుకున్న వారు ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ కీ దూరంగా ఉండాలని చెబుతున్నారు. అయితే బరువు తగ్గాలి అనుకున్న వారు తీసుకునే బ్రేక్ ఫాస్ట్ విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. మరి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఈజీగా బరువు తగ్గవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గుడ్లు మంచి పోషకాహారం. గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మీరు గుడ్డును తింటే బలంగా ఉంటారట. గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయట. ఇవి రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడతాయని చెబుతున్నారు. దీన్ని తింటే చాలా సేపటి వరకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుందట. ఆకలి కూడా నియత్రణలో ఉంటుందని అందుకే బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లను తినాలని చెబుతున్నారు. ఇడ్లీ, దోశలకు ప్రత్యామ్నాయంగా పెరుగును బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు. ఒక కప్పు పెరుగును తింటే మీకు ఆరోగ్యకరమైన కేలరీలు అందుతాయట.
ఇది మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి, కొవ్వులు పేరుకుపోకండా కాపాడుతుందట. అలాగే ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తీసుకోవచ్చట. ఇందులో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు శరీరంలో అనవసరమైన క్యాలరీలు పేరుకుపోకుండా చేస్తాయట. ఓట్స్ ను పాలతో కలిపి తినడం వల్ల కూడా శరీరానికి ఎనర్జీ అందుతుందట. అలాగే బ్రేక్ ఫాస్ట్ ఎక్కువగా తినని వారు సాబుదానా కిచిడీని తినమని చెబుతున్నారు. ఈ కిచిడీలో క్యారెట్లు, బఠానీలు వంటి పోషకాలు ఎక్కువగా ఉండే పదార్థాలను చేర్చాలట. దీంతో మీరు త్వరగా బరువు తగ్గుతారట. బరువు తగ్గాలనుకునే వారు రైస్ ఉప్మాను తినవచ్చట. దీనిలో ఫైబర్, విటమిన్ బి, కాల్షియం, జింక్ తో పాటుగా ఎన్నో ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయట. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.