Crop Loan Waiver : తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీపై ఫీల్డ్ సర్వే ప్రారంభం
రేషన్ కార్డు లేని కారణంగా రుణమాఫీ ఆగిన రైతుల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం రైతు భరోసా రుణమాఫీ పేరుతో యాప్‌ను రూపొందించింది
- By Sudheer Published Date - 11:38 AM, Thu - 29 August 24

తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ (Crop Loan)పై ఫీల్డ్ సర్వే ప్రారంభమైంది. తెలంగాణ లో అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చినట్లే ఆగస్టు 15 లో రెండు లక్షల వరకు రుణమాఫీ చేసింది. కాకపోతే కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడడం తో అందరికి రుణమాఫీ కాలేదు. దీంతో రుణమాఫీ కానీ రైతులు ఆందోళన బాట చేపట్టారు. ఈ క్రమంలో సర్కార్ రుణమాఫీపై ఫీల్డ్ సర్వే ప్రారంభించింది.
We’re now on WhatsApp. Click to Join.
రేషన్ కార్డు లేని కారణంగా రుణమాఫీ ఆగిన రైతుల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం రైతు భరోసా రుణమాఫీ పేరుతో యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌లో నేటి నుంచి మండల వ్యవసాయ అధికారులు వివరాలు నమోదు చేయనున్నారు. ఆయా బ్యాంకుల నుంచి వివరాలు తీసుకొని మొదటగా ఇంటి యజమాని, ఆ తర్వాత భార్య, కుమారుడు, కూతురు, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు నెంబర్లు, తీసుకున్న రుణాలు వంటివి పరశీలించి రెండు లక్షల రూపాయల వరకు పొందు పరచనున్నారు.
ఇది ఒక సెల్ప్ డిక్లరేషన్ పత్రంలో పొందుపరిచి సంబంధిత రైతుతో సంతకం చేయించి పంచాయతీ కార్యదర్శితో అటెస్టేషన్ చేయించనున్నారు. సంబందిత యాప్‌లో అప్‌లోడ్ చేయించే బాధ్యత మండల వ్యవసాయ అధికారులకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా 4.24 లక్షల అకౌంట్లు పెండింగ్‌లో ఉండగా నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. రుణ సమాచార పత్రం, స్వీయ ధృవీకరణ పత్రం, ఫోటో, క్రాప్ లోన్ వివరాలను పంట భరోసా యాప్ లో అప్ లోడ్ చేయనున్నారు. కుటుంబ నిర్థారణ తర్వాత రుణమాఫీ నిధులని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనుంది. శనివారం సాయంత్రం కల్లా ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం వారి అకౌంట్లకు సంబంధించి రుణమాఫీ చేయనున్నట్లు సమాచారం.
Read Also : Radha Yadav : గుజరాత్ వరదల్లో చిక్కుకున్న టీమిండియా స్పిన్నర్