Radha Yadav : గుజరాత్ వరదల్లో చిక్కుకున్న టీమిండియా స్పిన్నర్
విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న తమను బోట్ల సాయంతో రక్షించిన NDRF బృందాలకు ధన్యవాదాలు అంటూ రాధాయాదవ్ తెలిపింది
- By Sudheer Published Date - 11:18 AM, Thu - 29 August 24

గతమూడు రోజులుగా గుజరాత్ (Gujarat) లో కురుస్తున్నభారీ వర్షాలకు రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. సౌరాష్ట్ర, తీర ప్రాంతాల్లోని 12 జిల్లాలను వరదలు ముంచెత్తాయి. బుధవారం 50-200MM మేర వర్షాలు పడ్డాయి. ఈరోజు కూడా అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD రెడ్ అలర్ట్ జారీచేసింది. ఈ భారీ వర్షాలకు దాదాపు 28 మంది మృతి చెందారు. ఈ మరణాలు రాజ్‌కోట్, ఆనంద్, మహిసాగర్, ఖేడా, అహ్మదాబాద్, మోర్బి, జునాగఢ్, బరూచ్ జిల్లాల నుండి సంభవించాయి. అదే సమయంలో,40 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 17000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె టీమిండియా మహిళా స్పిన్నర్ రాధాయాదవ్ (Radha Yadav) వరదల్లో చిక్కుకున్నారు. దీంతో NDRF బృందాలు ఆమెను కాపాడాయి. ఈ సంగతిని ఆమే స్వయంగా ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలకు విశ్వమైత్రీ నది కట్టలు తెంచుకుంది. దీంతో వడోదరాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న తమను బోట్ల సాయంతో రక్షించిన NDRF బృందాలకు ధన్యవాదాలు అంటూ రాధాయాదవ్ తెలిపింది.
అలాగే భారీ వరదల నేపథ్యంలో ప్రధాని మోదీ.. సీఎం భూపేంద్ర పటేల్‌కి కాల్ చేశారు. సహాయక చర్యలు చేపట్టడానికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుందని మోదీ తెలిపారు. వడోదరాలో సహాయక చర్యలు ముమ్మరం చేయడానికి ఐదు అదనపు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF)బృందాలు, ఆర్మీ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అహ్మదాబాద్, సూరత్ నుంచి రెస్క్యూ బోట్లను వడోదరకు పంపినట్లు అధికారులు తెలిపారు. వర్షాల పరిస్థితి, సహాయక చర్యలు సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని సీఎం ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో నదులు పొంగిపొర్లుతున్నాయని.. నదులు,డ్రెయిన్స్, సరస్సుల్లోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలని తీరప్రాంతాల కలెక్టర్లను కోరారు.
Read Also : Submarine Arighat: అణు జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ అరిఘాట్’ సిద్ధం.. నేడు నేవీకి అప్పగింత..!