రేవంత్ రెడ్డి ని సీఎం గా ప్రకటించకపోతే ఆత్మహత్య చేసుకుంటాం అంటున్న అభిమానులు
మాకు వేరే డిమాండ్ లేదు. ఇన్ని రోజులూ BJP, BRSతో పోరాడాం. రేవంత్ రెడ్డి వల్లే 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు
- By Sudheer Published Date - 03:27 PM, Tue - 5 December 23

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ (Congress) విజయం సాధించిందనే ఆనందం లేకుండా చేస్తుంది అధిష్టానం..గత రెండు రోజులుగా సీఎం (CM) ఎవరో ప్రకటించకుండా మభ్యపెడుతూ వస్తుండడం తో శ్రేణుల్లో ఆగ్రహం పెరిగిపోతుంది. ఇదే క్రమంలో ఇతర పార్టీల నేతలు , శ్రేణులు కాంగ్రెస్ ఫై విమర్శలు , సెటైర్లు చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని సీఎం గా ప్రకటించాలంటూ పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా హైదరాబాద్ లో రేవంత్ అభిమానులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి రేవంత్ ను సీఎం చేయాలంటూ డిమాండ్ చేసారు. మాకు వేరే డిమాండ్ లేదు. ఇన్ని రోజులూ BJP, BRSతో పోరాడాం. రేవంత్ రెడ్డి వల్లే 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. రేవంత్ రెడ్డిని సీఎం చేయండి’ అంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్ చల్ చేశాడు. పక్కనున్న వారు అతడి దగ్గరి నుండి పెట్రోల్ బాటిల్ తీసుకొని పక్కకు వేశారు.
ఇదిలా ఉంటె రేవంత్ రెడ్డి పై ఏపీ టీడీపీ నేత హాట్ కామెట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటం చాలా సంతోషించదగ్గ విషయమని ఏపీ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు నని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ మిత్ర పక్షాలేనని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం పంపకాల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి ఇప్పుడు ఓ అవకాశం వచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం అయితేనే బాగుంటుందని.. రేవంత్ సీఎంగా ఉంటే.. విభజన పంపకాలు సూలువుగా జరుగుతాయి అని అన్నారు.
Read Also : Revanth Reddy CM : రేవంత్ రెడ్డి ని సీఎం గా తేల్చేసిన రాహుల్ ..!