Hyderabad : హైదరాబాద్‌లో నకిలీ బాబా అరెస్ట్.. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నకిలీ బాబాని పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ
- By Prasad Published Date - 07:03 AM, Sat - 4 March 23

మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నకిలీ బాబాని పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టం, 2012 కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. డిసెంబర్ 12న, రహమతాబాద్ షరీఫ్ దర్గాలో చేతబడి చేసే 52 ఏళ్ల షగులాం నక్ష్బంద్ హఫీజ్ పాషాపై పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. మూడేళ్ల క్రితం గుండె సంబంధిత సమస్యలు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, నరాల బలహీనతతో బాధపడుతున్నట్లు ఫిర్యాదుదారు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె రహ్మతాబాద్ షరీఫ్ దర్గాలో ప్రార్థనలు చేయడానికి వెళ్లింది. దర్గా వద్ద రఫీక్, రసూల్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెను మాంత్రికుడు హఫీజ్ పాషాకు పరిచయం చేశారు. అతను అక్కడ ప్రార్థనలు నిర్వహించిన తర్వాత హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో ప్రార్థనలు చేయడానికి వెళ్లాడు. ప్రార్థనల నెపంతో హఫీజ్ పాషా తన ఇంట్లో ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేయగా.. ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని బాబా ఆరోపించాడు.
ఆమె తల్లిదండ్రుల సహాయంతో అతను ప్రార్థనలు నిర్వహించే గదిలో రహస్య కెమెరాలను అమర్చింది. తదుపరిసారి అతను ప్రార్థనలు చేయడానికి ఆమె ఇంటికి వెళ్లి ఆమెను లైగింకంగా వేధించిన సీసీ పుటేజీ వీడియోలు బయటపడ్డాయి. బాధితురాలి కుటుంబం కెమెరా ఫుటేజీతో నకిలీ బాబా బాగోతం బయటపెట్టింది. . నేరాన్ని అంగీకరించిన నకిలీ బాబా ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మబలికించాడు.పెళ్లికి ఫిక్స్ అయిన తేదీ దగ్గరపడుతుండగా, పెళ్లికి దూరంగా ఉండేందుకు అమీర్‌పేటలోని ప్రైమ్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యానని నకిలీ బాబా నాటకం ఆడాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన లంగర్‌హౌస్ పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Related News

Data Stolen: దేశంలోనే అతి పెద్ద డేటా స్కామ్!.. 16.80 కోట్ల మంది డేటా భారీగా చోరీ..
దేశంలోనే అతి పెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా..